ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... వైసిపి నేతలను తెలుగుదేశం ప్రభుత్వం అనేక ఇబ్బందులను పెడుతోంది. ఇక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ.. తొక్కేసే ప్రయత్నం చేస్తోంది ఈ కూటమి ప్రభుత్వం. ఇప్పటికే చాలా నేతలను.. టార్గెట్ చేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఇవాళ లేదా రేపు వల్లభనేని వంశీని కూడా అరెస్టు చేయబోతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో... వైసిపికి షాక్ ఇచ్చేలా వివాదాస్పద నిర్ణయం తీసుకుంది చంద్రబాబు ప్రభుత్వం.


జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసిన తెలుగు అకాడమీ చైర్ పర్సన్ బాధ్యతలను నిర్వహించిన లక్ష్మీపార్వతికి.. ఎదురుదెబ్బ తగిలింది. ఆమెకు షాక్ ఇచ్చేలా చంద్రబాబు సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. నందమూరి లక్ష్మీపార్వతి  కి గత ప్రభుత్వంలో కేటాయించిన ఆంధ్ర యూనివర్సిటీ  ప్రొఫెషనల్ షిప్... అంటే గౌరవ ఆచార్యురాలు అనే హోదాను... తొలగించడం జరిగింది. ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.


దీంతో ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్టార్ ప్రొఫెసర్ కిషోర్ బాబు..ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. అలాగే ఆమెకు ఇప్పటివరకు యూనివర్సిటీ నుంచి వేతనం కూడా చెల్లించలేదని తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగు అకాడమీ చైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన సమయంలో... ఆ యూనివర్సిటీలో ఉన్న పిహెచ్డి విద్యార్థులకు.. గైడ్ గా కూడా లక్ష్మీపార్వతి... పనిచేయడం జరిగింది. అప్పుడు ఆమె ఎంతో కష్టపడ్డారు దానికోసం!


అయితే ఆ పదవిని కూడా...  తీసేసింది చంద్రబాబు ప్రభుత్వం. విద్యార్థులకు గైడ్  గా ఉన్న లక్ష్మీపార్వతిని.. ఆ విధుల నుంచి తొలగిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఒకేసారి నందమూరి లక్ష్మీ పార్వతికి రెండు ఎదురు దెబ్బలు తగిలాయి.. ఇది ఇలా ఉండగా నందమూరి లక్ష్మీపార్వతి వర్సెస్  ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి  నారా చంద్రబాబు నాయుడు  మధ్య వివాదాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ వీరి మధ్య గొడవలు ఉన్నాయి. మరి ఈ పదవులు పోవడంతో నందమూరి లక్ష్మీపార్వతి ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: