వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను పోటీలోకి దించనున్నట్లు ఆయన ప్రకటించడం జరిగింది.టికెట్ ఎవరికి కేటాయించాలన్న అంశంపై ముఖ్య నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్న తరువాత జగన్ మోహన్ రెడ్డి బొత్స పేరును ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు 30 వ తేదీన ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనుంది. ఆగస్టు 13 దాకా నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇకపోతే ఎక్స్ ఆఫిషియో మెంబర్లతో కలిసి మొత్తం ఓట్లు 841 ఉన్నాయి. వైసీపీకి 615 ఇంకా టీడీపీకి 215 ఓట్లు ఉండగా.. 11 ఖాళీలు ఉన్నాయి. గతంలో ఇక్కడి నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన వంశీకృష్ణయాదవ్ ఎన్నికల ముందు జనసేనలో చేరడం జరిగింది. వైసీపీ ఫిర్యాదుతో ఆ వెంటనే అతనిపై మండలి చైర్మన్ అనర్హత వేటు వేయడం జరిగింది. దీంతో ఇక్కడ ఉప ఎన్నికకు ఈసీ తాజాగా నోటిఫికేషన్ ని విడుదల చేసింది.


ఇదే ఎమ్మెల్సీ స్థానంలో పోటీకి వైసీపీ నుంచి మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు ఇంకా అలాగే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన బొత్స సత్యనారాయణ సతీమణి ఝాన్సీ ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. కానీ నేడు జగన్ స్థానిక నాయకులతో సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించడం జరిగింది. ఆ తరువాత బొత్స సత్యనారాయణ పేరును ఫైనల్ చేశారు. ఉత్తరాంధ్రలో బలమైన నాయకుడిగా ఉన్న బొత్స సత్యనారాయణను పోటీలోకి దింపడం వల్ల ఇక్కడ సులభంగా గెలవచ్చని జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. అలాగే మరోవైపు కూటమి కూడా ఆ ఎమ్మెల్సీ స్థానానికి గట్టి పోటీ ఇవ్వాలని గట్టిగా భావిస్తోంది. ఇంకా బొత్స సత్యనారాయణను ధీటైన నాయకుడిని బరిలోకి దింపి.. ఆ ఎమ్మెల్సీ స్థానంలో పసుపు జెండాని ఎగురవేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. అయితే.. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే అయిన గండి బాబ్జీ పోటీ చేయనున్నట్లు స్థానికంగా ప్రచారం అనేది జరుగుతోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: