మెగా డీఎస్సీ కోసం నిరుద్యోగులు ఎంతగా ఎదురు చూశారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెగా డీఎస్సీ పేరిట కేవలం కొన్ని వేల పోస్టులను మాత్రమే వదిలారు. దీంతో చాలామంది నిరుద్యోగులు ఉద్యోగం లేక ఎన్నో అవస్థలు పడ్డారు. కానీ ఈసారి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డీఎస్సీ పేరుతో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని కూడా పిలుపునిచ్చింది ప్రభుత్వం. అయితే ఈ గడువు కాస్త మరికొన్ని గంటల్లో ముగియనుంది. జూలై 3వ తేదీన ప్రారంభమైన ఈ ఆన్లైన్ టెట్ దరఖాస్తులు ఆగస్టు 3వ తేదీతో ముగియనున్నాయి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా దరఖాస్తు గడువు పొడిగించేది లేదని ఇప్పటికే విద్యాశాఖ కూడా క్లారిటీ ఇచ్చింది.

ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కూడా టెట్ అభ్యర్థులకు అలర్ట్ విధించింది విద్యాశాఖ. ఇకపోతే పరీక్ష మొత్తం రెండు పేపర్లు ఉంటుంది పేపర్ -1A ఎస్ జి టి టీచర్లకు,  పేపర్ -1B స్పెషల్ ఎడ్యుకేషన్ ఎస్జీటీ టీచర్లకు ఉంటుంది. పేపర్ -2A స్కూల్ అసిస్టెంట్లకు, పేపర్ - 2B స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్లకు నిర్వహిస్తారని దరఖాస్తులు పొందుపరిచారు. పేపర్ -1,  పేపర్ -2 పరీక్షలలో మొత్తం 150 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలకు 150 మార్కులకు నిర్వహిస్తారు. ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రోజుకు రెండు సెషన్ ల చొప్పున ఈ ఎగ్జామినేషన్ ఉంటుంది.


మొదటి సెషన్ ఉదయం 9:30 గంటలకు నుండి మధ్యాహ్నం 12:00 గంటలకు,  రెండవ సెషన్ మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు ఉంటుందని తెలిపారు.. సెప్టెంబర్ 22 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అక్టోబర్ 3 నుండి అక్టోబర్ 20 తేది వరకు ఈ టెట్ పరీక్షలు జరుగుతాయని కూడా తెలిపారు . ప్రాథమిక ఆన్సర్ కీ  అక్టోబర్ 4 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. తుది ఆన్సర్  కీ అక్టోబర్ 27న విడుదల కానుండగా,  టెట్  ఫలితాలు నవంబర్  2 న  ప్రకటిస్తామని స్పష్టం చేశారు విద్యాశాఖ అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: