ఆంధ్రప్రదేశ్లో మరో ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. విశాఖ జిల్లాలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయిన బొమ్మన బోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాద‌వ్‌ ఇటీవల సాధారణ ఎన్నికలలో విశాఖ దక్షిణ నియోజకవర్గ నుంచి జనసేన ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకుముందు ఆయన వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు . పార్టీ మారిన తర్వాత ఆయన జనసేనలోకి వెళ్లి ఎమ్మెల్యే అయ్యారు. ఈ క్రమంలోనే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ ఉపఎన్నిక కోసం జగన్ విశాఖ జిల్లాకు చెందిన నాయకులతో చర్చించి పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును అధికారికంగా ప్రకటించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఉప ఎన్నిక నేపథ్యంలో జిల్లాకు చెందిన పార్టీ నేతలతో జగన్ వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోని బొత్స పేరు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.


మొన్నటి సార్వత్రిక ఎన్నికలలో పార్టీ ఘోరపరాజ‌యం తో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పైగా స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీకి పూర్తి మెజార్టీ ఉంది. అందుకే తమ సిట్టింగ్ సీటు ను ఎలాగైనా నెగ్గి పరువు కాపాడుకోవాలని జగన్ సీనియర్ నేత అయిన బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఇక మొన్న ఎన్నికలలో బొత్స భార్య బొత్స‌ ఝాన్సీ లక్ష్మీ విశాఖ ఎంపీగా పోటీ చేసి భరత్ చేతిలో ఏకంగా 5 లక్షల ఓట్ల తేడాతో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. వాస్తవంగా చూస్తే బొత్స ఎత్తుగడ సూపర్ అని చెప్పాలి. బొత్స గెలిస్తే ఖచ్చితంగా జగన్ తన ఆధిపత్యం నిలుపుకున్నట్టు అవుతోంది. ఇక్కడ వైసీపీ తరఫున బొత్స గెలిస్తే కచ్చితంగా అది బాబు - పవన్ కు పెద్ద ఇబ్బంది అని చెప్పాలి. ఒకవేళ వైసిపి స్థానిక సంస్థలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులను తమ వైపునకు తిప్పుకుని కూటమి అభ్యర్థి గెలిస్తే అది జగన్‌కు పెద్ద షాక్ గానే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: