ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల పైన ఇప్పటికి చాలా మంది నేతలు ఇతర రాజకీయ పార్టీలు కూడా పలు రకాల అనుమానాలను తెలియజేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వివిధ చోట్ల పోలైన ఓట్లకి కంటే కౌంటింగ్ అప్పుడు ఎక్కువ వచ్చాయని.. కొన్నిచోట్ల తక్కువ వచ్చాయని విధంగా ADR సంస్థ ఏదైతే చేసిందో.. ఇందులో ఆంధ్రప్రదేశ్ గురించి స్పెషల్ గా చెప్పింది ఏమిటంటే.. పోలైన లేదా లెక్కించబడిన ఓట్ల మధ్య వ్యత్యాసం.. దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నదంటూ తెలిపింది.


ఆంధ్రప్రదేశ్లో 25 నియోజకవర్గాలలో కలిపి.. మొత్తం పోలైన ఓట్ల కంటే 85 ,775 ఓట్లని తక్కువగా లెక్కించారని.. అలాగే మరొక నాలుగు నియోజకవర్గాలలో పోలైన ఓట్ల కంటే 3225 ఓట్లు  అధికంగా లెక్కించారని ఇది అనుమానాలకు దారితీస్తోంది అంటూ ఏడీఆర్ తెలియజేసింది. ఓట్లలో తేడా ఎలా వచ్చిందో తెలుపాలని ఏడిఆర్ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ , ఎన్నికల కమిషనర్ డాక్టర్ సిగ్నేష్ కుమార్ లేఖ రాయడం జరిగిందట. సార్వత్రిక ఎన్నికలలో ఈవీఎంల ఓట్ల లెక్కింపు విషయంలో తీవ్ర ఆందోళన తెలియజేస్తోంది ఏడిఆర్.


ఈ వ్యత్యాశాల పైన ఈవీఎం తక్షణ వివరణ ఇవ్వాలని.. ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వాస సడలియకుండా చూడాలని తెలియజేస్తోంది. అసలు ఆ 21 నియోజకవర్గాలలో వాస్తవానికి వైసీపీ నేతలే లెక్కించాల్సి ఉన్నది. కానీ అక్కడ సంతకాలు పెట్టి వచ్చేసారట. కొన్ని నియోజకవర్గాలలో వేళలో మెజారిటీతో గెలవడం జరిగింది.. అయితే ఆ 25 సీట్ల గురించి వైసిపి వాళ్ళ కన్నా డౌట్ ఉందా లేదా అనే అనుమానం ఎప్పుడు మొదలవుతోంది. అయితే గతంలో కూడా కొద్ది రోజుల క్రితం చాలా పార్టీల సైతం ఈవీఎం ట్రాప్ చేశారనే విధంగా వార్తలు వినిపించాయి.ఈ విషయం పైన వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వంటి వారు చేసినప్పటికీ కూడా.. ఇప్పుడు అధికారంలోకి తీసుకురావడంతో వారు అలాంటివేమీ లేవని తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: