- రాజకీయాల్లో ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతాయి
-సీఎం రేవంత్ రెడ్డిని ఓడించిన పట్నం నరేందర్ రెడ్డి.

 రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు. ప్రస్తుత కాలంలో రాజకీయ అవసరాలకు ఏ పార్టీలో కైనా మారెందుకు నాయకులు సంసిద్ధమవుతున్నారు. బండ్లు ఓడలవుతాయి ఓడలు బండ్లు అవుతాయి అనే సామెత గమనిస్తే మాత్రం ప్రస్తుత రాజకీయాలకు బాగా సూట్ అవుతుంది. అలా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చాయి. వరుసగా రెండుసార్లు  టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించి కేసీఆర్ సీఎం అయ్యారు. ఇక మూడోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. అంతటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ని కూడా  తన సొంత గడ్డపై ఓడించారు. ఆయన ఎవరు ఆ వివరాలు ఏంటో చూద్దాం.

 రేవంతుvs నరేందర్ రెడ్డి:
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయాన్ని సాధించి అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి కూడా కొడంగల్ నుంచి అద్భుతమైన మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.  అలాంటి రేవంత్ రెడ్డిని కోడంగల్ లో పట్నం నరేందర్ రెడ్డి దారుణంగా ఓడించారు. ఆ ఓటమిని తట్టుకోలేక రేవంత్ రెడ్డి మళ్ళీ  రాష్ట్రంలోని అతి పెద్ద నియోజకవర్గం అయినటువంటి మల్కాజ్ గిరికి వెళ్లి  ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన కొద్ది రోజుల్లోనే రేవంత్ రెడ్డికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పగ్గాలు అందించింది. రేవంత్ స్టార్ కంపైనర్ గా రాష్ట్ర మొత్తం తిరిగారు.


ఇక 2018 ముందస్తు ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ పార్టీ పట్నం నరేందర్ రెడ్డిని బరిలోకి దించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం నువ్వా నేనా అంటూ సాగింది. ఇక తన నియోజకవర్గంలో తాను తప్పకుండా గెలుస్తానని నమ్మకంతో ఉన్న రేవంత్ కు షాక్ తగిలింది. 2018 శాసనసభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిపై 9,319 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆయన సంచలనంగా మారిపోయాడు. అలాంటి పట్నం నరేందర్ రెడ్డి  2009 మే 2 నుంచి 2014 వరకు కోడంగల్ టిడిపి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా పనిచేశారు. 2017 లో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యదర్శిగా నియమితులయ్యాడు. ఇక 2018లో శాసనసభ ఎన్నికల్లో కోడంగల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి రేవంత్ ని ఓడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: