తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత  అసెంబ్లీ సమావేశాలు చాలా వాడి వేడిగా జరుగుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ చేస్తున్న పనులపై దారుణంగా విమర్శలు చేస్తున్నారు. ఈ విధంగా ఒకరిపై ఒకరు  సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటూ  సభంతా నిప్పులు చెలరేగుతుంది. అలాంటి ఈ తరుణంలో మాజీ మంత్రి హరీష్ రావు  రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మరీ ప్రశ్నలు సంధిస్తున్నారు. కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత ఉద్యోగులకు, నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందని, రైతులకు దారుణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు.  తాజాగా ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ పై కూడా మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు సంధించారు.

 జాబ్ క్యాలెండర్ కాదని ఒక జోక్ క్యాలెండర్ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ విద్యార్థులను దారుణంగా మోసం చేస్తుందని, అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్  8 నెలలు గడిచినా ఒక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు.  జాబ్ క్యాలెండర్ అని చెబుతున్నారు తప్ప దానిపై సీఎం గారు  సంతకం పెట్టకుండానే ప్రకటించారని తెలిపారు. ఈ విధంగా నిరుద్యోగులను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం  జాబ్ క్యాలెండర్ పై చర్చ పెట్టాలి. మేము చర్చకు సిద్ధం  మీరు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికీ 2లక్షల ఉద్యోగాలు లేవు నిరుద్యోగ భృతి లేదు  అన్నారు.

 అంతేకాకుండా రేవంత్ రెడ్డి ఒక గన్మెన్ లేకుండా ఉస్మానియా యూనివర్సిటీ అశోక్ నగర్ ఏరియాలోకి రాగలరా అంటూ  సవాలు విసిరారు. మీరు ఉద్యోగాలు ఇస్తున్నామని చెబుతున్నారు.  ఒకవేళ నిరుద్యోగులు మిమ్మల్ని నమ్మితే మీరు ఎలాంటి భయం లేకుండా గన్ మేన్స్ లేకుండా  అశోక్ నగర్ కి రావాలంటూ సవాల్ విసిరారు. కనీసం సభా మర్యాదలు పాటించడం లేదని, మహిళా ఎమ్మెల్యేలపై కూడా దారుణంగా విరుచుకుపడుతున్నారని ప్రతిపక్షాల మైక్ కట్ చేస్తున్నారని ఆరోపించారు.  నిరుద్యోగుల ఉద్యోగాల గురించి అడిగితే మాపై  కేసులు పెడుతూ ట్రోలింగ్ చేస్తారా అన్నారు.  నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ దగా చేస్తోందని శాసనసభ చరిత్రలో ఇది బ్లాక్ డే అంటూ కౌరవ సభగా మారిందని  అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: