వైసీపీలో కొత్త బలిపరుస్తూ రెడీ అయ్యాడా ? ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలలో చిత్తుచిత్తుగా ఓడిపోయిన ఓ సీనియర్ నేతను జగన్ మరోసారి బలి పశువు చేసేందుకు రంగం సిద్ధమైందా ? అంటే అవుననే చెప్పాలి. తాజాగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును జగన్ ఖరారు చేశారు.. దీంతో వైసిపి నేతలే పాపం బొత్స అని జాలి చూపిస్తున్నారు. ఇతర నేతలు ఎవరు ? అసలు పోటీ చేయడానికి ముందు రాలేదు. అందుకే జగన్ బొత్స‌ను బలవంతంగా ముందుకు తోశారు.. తన వల్ల కాదు అని బొత్స‌ చెప్పాలని అనుకున్నా సీనియార్టీ అడ్డు రావడంతో మౌనంగా బయటకు వచ్చేసారు.


ఇక ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలలో బొత్స ఫ్యామిలీ ఐదు చోట్ల ఘోరంగా ఓడిపోయింది.. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ - గజపతినగరంలో బొత్స సోదరుడు అప్పల నరసయ్య - నెల్లిమర్లలో బొత్స మేనకోడలు భర్త అప్పలనాయుడు - విజయనగరం ఎంపీగా బొత్స బంధువు బెల్లాన చంద్రశేఖర్ - ఇక విశాఖపట్నం ఎంపీగా బొత్స భార్య ఝాన్సీ ఇలా ఐదుగురు ఓడిపోయారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ ఐదుగురు ఓటమి బొత్స ఓటమి కిందే చెప్పాలి. బొత్స‌ పట్టుపట్టి మరి వీళ్ళకు టిక్కెట్లు ఇప్పించుకున్నారు.


ఇక ఇప్పుడు బొత్స ఫ్యామిలీ నుంచి తాజాగా బత్స ఓడిపోతే అది రెండు నెలల వ్యవధిలో బొత్స ఫ్యామిలీకి ఆరో ఓటిమి అవుతుంది.. అధికారికంగా చూస్తే విశాఖ స్థానిక సంస్థలలో వైసీపీకి 750 -- టీడీపీకి 250 వరకు ఓట్లు ఉన్నాయి. ఈ లెక్క చూస్తే వైసిపి సులువుగా గెలవాలి ... కానీ ఎన్నికల సమయంలోనే చాలామంది వైసిపి ఓటర్లు పార్టీ మారారు. ఎన్నికల ఫలితాలు వచ్చాక మరింత మంది పార్టీ మారారు.. ఇక టిడిపి తరఫున మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జిని ఎమ్మెల్సీగా నిలబెడతారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: