- రాజ‌కీయాల‌కు దూరంగా వంశీ .. నాని ?
- త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న చేసే ఛాన్స్ ..?

( గుడివాడ , గ‌న్న‌వ‌రం - ఇండియా హెరాల్డ్ )

వైసీపీకి వైసిపి అధినేత జగన్ కు ఇది పెద్ద పిడుగు లాంటి వార్త అని చెప్పాలి. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి ... గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని - గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇద్దరు క్రియాశీలక రాజకీయాలకు దూరం కాబోతున్నారా ? వచ్చే ఎన్నికలలో వీరు పోటీ చేయకూడదు అని నిర్ణయం తీసుకున్నారా ? అంటే అవును అన్న చర్చలు ఈ ఇద్దరు నేతలకు చెందిన అనుచరుల నుంచి వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీతో రాజకీయంగా ఎదిగిన వంశీ - నాని ఇద్దరు ఆ తర్వాత వైసీపీకి దగ్గరయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో కొడాలి నాని గుడివాడ నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. గన్నవరంలో వంశీ కూడా చిత్తుచిత్తుగా ఓడిపోయారు.


వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ అండదండలు చూసుకుని కొడాలి నాని - వంశీ ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీతో పాటు చంద్రబాబు - లోకేష్ పై తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ క్యాడర్ కు బాగా టార్గెట్ అయ్యారు.  ఇప్పుడున్న పరిస్థితులలో వైసీపీ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ... రాజకీయంగా యాక్టివ్ గా ఉన్న ఇబ్బందులు తప్పవని ఇద్దరి నేతలు భావిస్తున్నారు. అందుకే రాజకీయంగా పూర్తిగా సైలెంట్ అయిపోవాలని రాజకీయాల నుంచి తప్పుకోవాలని వంశీ - నాని ఇద్దరు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే కృ  ష్ణా జిల్లా లోనే  కాకుండా వైసీపీకి  రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి. అలాగే వైసిపి అధినేత జగన్ కి కూడా ఇది పెద్ద మైనస్ అవుతుంది. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మాజీ మంత్రి

మరింత సమాచారం తెలుసుకోండి: