( హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) .

అదేంటి తెలంగాణలో ఇప్పటికే 33 జిల్లాలు ఉన్నాయి .. ఒక జిల్లా క‌నుమరుగు కావటం ఏంటి ? అది ఎందుకు మాయమైపోతుంది అని అనుకుంటున్నారా ? హైదరాబాద్ మహానగరం విస్తరిస్తోంది.. దీంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు అన్ని శ‌రవేగంగా అందులో కలిసిపోతూ వస్తున్నాయి. హైదరాబాద్ విస్తరణతో సంగారెడ్డి కూడా మహానగరంలో కలిసిపోనుంది. మొత్తం సంగారెడ్డి జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందటానికి హైదరాబాద్ కారణం అవుతోంది. కొన్ని వేల మంది కార్మికుల రోజు హైదరాబాదు నుంచి సంగారెడ్డి వరకు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు పారిశ్రామిక విప్లవం కారణంగా రియల్ ఎస్టేట్ కూడా శరవేగంగా పుంజుకుంటుంది. దీంతో సంగారెడ్డిలో నివాసయోగ్యమైన కాలనీలు రోజురోజుకు శరవేగంగా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్ ఓల్డ్ ముంబై హైవే అంటే చందానగర్ శివారు అనుకునేవారు .. కానీ ఇప్పుడు సంగారెడ్డి అనుకునే పరిస్థితి వచ్చేసింది.


చందానగర్ - రామచంద్రపురం - పటాన్ చెరు - ఇస్నాపూర్ - కంది - సంగారెడ్డి .. సంగారెడ్డి చుట్టు ప‌క్క‌ల ప్రాంతాలు .. ఇలా రియల్ ఎస్టేట్ మొత్తం అభివృద్ధి చెందింది. హైదరాబాద్ నుంచి సంగారెడ్డి వరకు భా రీగా రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయి. ఇక పెద్ద ఎత్తున స్థలాలు కొనుగోలు చేసే ఔత్సాహికులు ఇప్పుడిప్పుడే ఇల్లు కట్టుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇక భవిష్యత్తు లోనూ హైదరాబాద్ మెట్రో సంగారెడ్డి వరకు విస్తరిస్తుంద‌న్న అంచనాలు కూడా ఉన్నాయి. పారిశ్రామికంగా సంగారెడ్డి జిల్లా మంచి అభివృద్ధి సాధించిందని చెప్పాలి. నిజానికి ముందు నుంచి పటాన్ చెరువు పెద్ద పారిశ్రామిక‌ ప్రాంతం. ఇటీవల కాలంలో కాలుష్యం లేకుండా పరిశ్రమలు జాగ్రత్త పడుతున్నాయి .. ఏది ఏమైనా ఇప్పుడు పారిశ్రామికంగా పఠాన్ చెరువు దాటేసి సంగారెడ్డి వైపు పరిశ్రమలు విస్తరిస్తున్నాయి ...దీంతో భవిష్యత్తులో సంగారెడ్డి కూడా గ్రేటర్ హైదరాబాద్ లో అంతర్భాగం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: