కనుమూరు రఘురామ కృష్ణంరాజు రాజకీయంగా ఎంత కాంట్రవర్సీయో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ర‌ఘురామ  కృష్ణంరాజు ప్రతి ఎన్నికకు ఒక పార్టీ మారుతూ వస్తున్నారు. గతంలో కాంగ్రెస్లో ఉండే రఘురామ 2014 ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి బిజెపిలోకి జంప్ చేశారు. ఇక 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం నుంచి తిరిగి వైసీపీలోకి జంప్ చేశారు.. 2019 ఎన్నికలలో వైసిపి నుంచి ఎంపీగా గెలిచినా రఘురామ ఏడాదికే పార్టీకి దూరమయ్యారు. నాలుగేళ్ల పాటు జనసేన - బిజెపి - తెలుగుదేశంతో స్నేహం చేస్తూ వచ్చిన రఘురామ ఈ ఎన్నికలకు ముందు టిడిపిలో జాయిన్ అయి ఉండి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.


వాస్తవానికి రఘురామ అంటే కూటమిలోని మూడు పార్టీల నేతలకు మంచి అభిప్రాయం ఉంది. ఐదేళ్లపాటు వైసీపీ ఎంపీగా ఉంటూ జగన్ ప్రభుత్వం పై ఎన్నో పోరాటాలు చేసి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే తెలుగుదేశం నుంచి ఎంతోమంది నేతలు ఐదేళ్లలో ఎన్నో పోరాటాలు చేశారు.. వారు ఎవరికీ లేని ప్రయారిటీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో రఘురామకు దక్కుతుంది. ఆయన చెప్పిన పనులు అవుతున్నాయి. ఆయన చెప్పిన అధికారులకు పోస్టింగులు దక్కుతున్నాయి.


చివరకు మంత్రులకు కూడా లేని ప్రాధాన్యత రఘురామకు దక్కుతుంది. ఇదే ఇప్పుడు కూటమిలోని మూడు పార్టీలకు చెందిన నేతల్లో తీవ్ర అసంతృప్తి కారణం అవుతోంది. కూటమి పార్టీలకు చెందిన నేతలు రఘురామ కు దక్కుతున్న ప్రయాణి చూసి కుళ్ళుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది. రఘురామ ఎక్కడ నోరు వేసుకుని పడిపోతాడో అన్న భయంతో ప్రభుత్వంలోని పెద్దలు కూడా ఆయన చెప్పిన పనులు చెప్పినట్టు చేస్తున్నారన్న చర్చ‌లు కూడా తెలుగుదేశం - జనసేన - బిజెపి వర్గాల్లో వినిపిస్తున్నాయి. నాలుగేళ్ల పాటు జనసేన - బిజెపి - తెలుగుదేశంతో స్నేహం చేస్తూ వచ్చిన రఘురామ ఈ ఎన్నికలకు ముందు టిడిపిలో జాయిన్ అయి ఉండి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: