టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో నటి రోజా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. దాదాపు స్టార్ హీరోల సరసన జతకట్టి ప్రేక్షకులను అలరించింది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలతో కలిసి నటించి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా తమిళ సినిమాల్లోనూ నటించి కొన్నేళ్లపాటు స్టార్ హీరోయిన్గా నటించింది.

ఇక మారుతున్న కాలానికి అనుగుణంగా తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ సినిమాలలో నటిస్తూ ఉండేది. కేవలం సినిమాల్లోనే కాకుండా టీవీ షోలలో చాలా చురుగ్గా పాల్గొనేది. ఆ తర్వాత కొన్ని రోజులకి రాజకీయాల మీద ఆసక్తితో సినీ కెరియర్ కు గుడ్ బై చెప్పేసి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమాల్లో అగ్ర హీరోయిన్ గా రాణించిన రోజాకు రాజకీయ రంగంలో వెంటనే విజయం రాలేదు. 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన రోజా తీవ్రమైన నెగిటివిటీని ఎదుర్కొంది.

2024లో రోజా ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో ఓటమి పాలయ్యాక రోజా పరిస్థితి దారుణంగా ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రోజాకి తెలుగులో ఎలాంటి సినిమా అవకాశాలు దొరకడం లేదట. కనీసం బుల్లితెరలో అయినా ఛాన్స్ దొరుకుతుందని.... ఏమైనా చేద్దామన్న ఎలాంటి అవకాశాలు రావడం లేదట. ఇక చేసేదేమీ లేక తన భర్త నేటివ్ ప్లేస్ తమిళనాడులో ట్రై చేస్తుందట. అక్కడ అయినా ఏమైనా టెలివిజన్ షోలో కనిపించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుందట.


అక్కడ నుంచి కూడా రోజాకి సరైన రెస్పాన్స్ రావడంలేదని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.  ఇది ఇలా ఉండగా, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ అభ్యర్థిలో చేతిలో ఓడిపోయారు మాజీ మంత్రి రోజా. వైసీపీ పార్టీకి చెందిన కొంత మంది లీడర్లు చేసిన తప్పిదాల వల్లే రోజా ఓడిపోయిందని నివేదికలు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: