ఇకపోతే గుడివాడ నుండి పోటీ చేసి గెలుపొందిన వెలిగండ్ల రాము ది ప్రేమ వివాహం. ఈయన సుఖద అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి వీరికి ఇద్దరు సంతానం కలిగారు. ఇక ఇప్పటికి కూడా వీరి సంసార జీవితం ఎంతో అన్యోన్యంగా ముందుకు సాగుతుంది. ఇకపోతే వీరి ఇద్దరి ప్రేమ గురించి , అది పెళ్లికి ఎలా దారి తీసింది అనే విషయాల గురించి వెనిగండ్ల రాము భార్య అయినటువంటి సుఖద కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది.
ఆ ఇంటర్వ్యూ ప్రకారం... మా ఇద్దరిదీ లవ్ మ్యారేజ్. మేము ఆర్విఆర్ కాలేజీలో క్లాస్మేట్స్. మేమిద్దరం క్లాస్మేట్స్ అయినప్పటికీ చాలా కాలం మాట్లాడుకోలేదు. ఒక రోజు నేను నాతో ఉన్న ముగ్గురు స్నేహితులు క్లాస్ లో సార్ చెప్పిన పాయింట్స్ నీ నోట్ చేసుకోలేదు. దానితో ఎవరైనా నోట్స్ ఇస్తే బాగుంటుంది అని అంతా కూడా అటు ఇటు చూసాం.
కానీ అక్కడ ఎవరు కూడా పెద్దగా స్పందించలేదు. అలాంటి సమయంలోనే నేను రాము వైపు చూశాను. నోట్స్ అని అడిగేలోపే రాము ఏమీ ఆలోచించకుండా అతని చేతిలో ఉన్న నోట్స్ ని నా టేబుల్ పై వేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అది అక్కడికే ఆగిపోయింది. ఆ తర్వాత కాలేజీలో మేమిద్దరం ప్రేమలో ఉన్నాము అని రకరకాల పుకార్లు మొదలు అయ్యాయి.
దానితో నేను షాక్ అయ్యాను. నేను అతనితో పెద్దగా ఎప్పుడు మాట్లాడనే లేదు... ఎలా ఇవన్నీ వచ్చాయా అని నేను అనుకున్నాను. ఆ తర్వాత నాకు తెలిసింది ఏమిటి అంటే రామునే ఆ న్యూస్ ను ఫుల్ గా స్ప్రెడ్ చేశాడు అని... కానీ ఆ తర్వాత ఫైనల్ ఇయర్ వచ్చే సరికి మేమిద్దరం కొంచెం కొంచెం గా మాట్లాడుకోవడం స్టార్ట్ చేశాం.
అలా ఫుల్ గా క్లోజ్ అయిన మేము ఇద్దరి వైపు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. మ్యారేజ్ అయిన తర్వాత చాలా కాలం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాం. వివాహం అయిన తర్వాత చాలా తక్కువ కాలంలోనే మాకు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. దానితో నేను ఆ పిల్లలని వారిని చూసుకోవడమే సరిపోయేది. ఇక ఆ తర్వాత మెల్లిమెల్లిగా మేము సెట్ అయ్యాం అని రాము భార్య చెప్పుకొచ్చింది.