ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో...  చంద్రబాబు కూటమి సర్కార్ సమర్థవంతంగా ముందుకు వెళ్తోంది. ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలను... నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇక చంద్రబాబు పాలన పట్ల ఏపీ ప్రజలు కూడా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఇలాంటి నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్యేలు చేసిన పని వివాదంగా మారింది. తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలందరూ... దాదాపుగా కొత్త కార్లు కొనుగోలు చేశారట.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు తెలియకుండానే ఇదంతా జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీలో కొత్తగా ఎన్నికైన వారు... ఫార్చునర్ కార్లు కొనుగోలు చేశారట. ఈ ఫార్చునర్ కార్ల ధర కోటి రూపాయలకు పైగా ఉంటుంది. ఒక్కో ఎమ్మెల్యే ఒకటి కంటే ఎక్కువ.. ఈ కార్లు కొనుగోలు చేశారని వైసీపీ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కూడా నిండ లేదు... ఇంతలోనే తెలుగు తమ్ముళ్లు.. ఇలా కార్లు కొనడం పై పెద్ద రచ్చ జరుగుతోంది.


ఏపీలో...  తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని.. అందుకే కొత్త ఎమ్మెల్యేలు వెంటనే కార్లు కొనుగోలు చేస్తున్నారని ఒక మరొక చంద్రబాబు పైన పడుతూ ఉంది. ఇది అంశాన్ని వైసీపీ గట్టిగా ప్రచారం చేస్తుంది. అయితే ఈ విషయం తెలియగానే చంద్రబాబు కూడా ఒకసారిగా షాక్ అయ్యాడట. ఏంటి నేను ఇంత పని చేశారా ? అని చంద్రబాబు నాయుడు ఆరా తీస్తున్నారట.


మరి దీనిపై నారా చంద్రబాబు నాయుడు ఎలాంటి ఆక్షన్ తీసుకుంటారో చూడాలి. కాగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా పూర్తి కాలేదు. ఇప్పటివరకు పెన్షన్ల ప్రక్రియ మాత్రమే... ముందుకు తీసుకోవాలని చంద్రబాబు ప్రభుత్వం. ఇక సూపర్ సిక్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం... దానిపైన ఇంకా స్పందించలేదు. మొన్నటి అసెంబ్లీ సమావేశాలలో కూడా బడ్జెట్ కూడా ప్రత్యేకంగా కేటాయించలేదు చంద్రబాబు నాయుడు. దీంతో కూటమి ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: