ఇవన్నీ కలిసి ఏ క్షణమైనా దాడి చేసే ముప్పు ఉంది. కానీ.. ఇజ్రాయెల్ ఏమైనా తక్కువ తిన్నదా. వారి డిఫెన్స్ ఫోర్స్ హై అలర్ట్ అయింది. ఈ ఉదంతంలో కీలక మలుపు ఏంటంటే.. అమెరికా రంగంలోకి దిగడం. వారికి మిడిల్ ఈస్ట్ అయిన ఇజ్రాయెల్ కు యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లను పంపుతోంది.
హనియా హత్యతో రగిలిపోతున్న ఇరాన్.. మిత్ర దేశాలతో కలిసి నలువైపులా ఇజ్రాయెల్ పై విరుచుకుపడాలని ప్లాన్ చేసింది. జో బైడన్ నెతన్యాహూ కి భరోసా ఇచ్చారు. దాడులు జరిగితే తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాగా పశ్చిమాసియాలో ఉద్రిక్తల నేపథ్యంలో పలు విమానయాన సంస్థలు సర్వీసులను రద్దు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత రాయబార కార్యాలయం సూచించింది.
ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కీలక సూచన చేసింది. ఈ యుద్ధ క్రమంలో పలువురు ఇజ్రాయెలీలు ఆ దేశం నుంచి శరణార్థులుగా ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు. అయితే అన్నీ ముస్లిం దేశాలు కావడంతో భారతే తమకు సేఫ్ అని యూదులు భావిస్తున్నారు. ఇజ్రాయెల్ అధికారి డేవిడ్ మాన్సిన్ తమకు భారత్ తే అత్యంత సురక్షిత ప్రాంతం అని చెప్పుకొచ్చారు. మిగతా ఏ దేశాలకు వెళ్లినా అంత భద్రత ఉండదని అన్నారు. మరి వీరంతా భారత్ కు శరణార్థులుగా వస్తారా. లేదా అనేది చూడాల్సి ఉంది.