ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇటీవల కాలంలో బాగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు వంద మంది చేసే పనులను ఒకే ఒక్క ఏఐ అప్లికేషన్ చేయగలుగుతోంది. దీనివల్ల జాబ్స్ పోతాయని చాలామంది ఆందోళన పడ్డారు కానీ ఇది వచ్చిన తర్వాత జాబ్స్ అనేవి ఇంకా పెరిగాయి. వైద్యరంగంలో AI ఉపయోగాలు బాగా పెరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం మహిళలలో బ్రెస్ట్ క్యాన్సర్‌ను ఫస్ట్ స్టేజెస్ లోనే కనిపెట్టగల ఏఐ అందుబాటులోకి వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీనివల్ల ఎంతోమంది ప్రాణాలు కాపాడగలడం సాధ్యమవుతుంది. ఇప్పుడు సైంటిస్టులు ఏఐతో మరొక అద్భుతం సృష్టించారు
ఇటీవల కాలంలో సంతాన ప్రాప్తి కలగక చాలామంది పురుషులు బాధపడుతున్నారు. టెస్టులు చేయించుకోవడం కూడా చాలా కష్టంగా మారింది. ముఖ్యంగా వారి శుక్రకణాల సంఖ్యను చెక్ చేయడం చాలా కష్టమైన పని. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు ఒక కొత్త AI పద్ధతిని కనుగొన్నారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ రక్తంలోని హార్మోన్ల స్థాయిలను చూసి పురుషులకు వంధ్యత్వం లేదా ఇన్‌ఫర్టిలిటీ వచ్చే అవకాశాన్ని ముందే చెప్పగలదు.
ఈ కంప్యూటర్ ప్రోగ్రామ్ చాలా మంది పురుషుల రక్తం, శుక్రకణాల సమాచారాన్ని చూసి నేర్చుకుంది. అందులో ముఖ్యంగా చాలా తీవ్రమైన వంధ్యత్వం ఉన్న పురుషులను ఈ ప్రోగ్రామ్ సరిగ్గా గుర్తించగలిగింది. అయితే, అన్ని రకాల పురుషుల విషయంలో ఈ ప్రోగ్రామ్ ఒకేలా పనిచేయలేదు.
ఈ AI మోడల్‌ను అభివృద్ధి చేయడానికి, శాస్త్రవేత్తలు అనేక మంది పురుషుల బ్లడ్ శాంపుల్స్, శుక్రకణాల పరీక్షల ఫలితాలను సేకరించారు. ఈ డేటాను కంప్యూటర్‌కు ఇచ్చి, రక్తంలోని వివిధ హార్మోన్ల స్థాయిలు, శుక్రకణాల నాణ్యత మధ్య సంబంధాన్ని గుర్తించేలా ట్రైనింగ్ ఇచ్చారు.
ఈ కంప్యూటర్ ప్రోగ్రామ్ శుక్రకణాల పరీక్షకు బదులు కాదు. కానీ ఇది మొదటి అడుగుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా సంతానలేని సామర్థ్యం అసలే లేని పురుషులను ఈ ప్రోగ్రామ్ సులభంగా గుర్తిస్తుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా సమస్య ఉన్నట్లు తెలిస్తే, వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. శాస్త్రవేత్తలు ఈ కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను మరింత సులభంగా ఉపయోగించేలా చేసి, ఆసుపత్రులు, హెల్త్ చెక్‌అప్‌లలో వాడేలా చేయాలని ప్లాన్ చేస్తున్నారు.