నంద్యాల జిల్లా మహానంది మండల పరిధిలో ఉండేటువంటి సీతారామపురంలో వైసీపీ నేత సుబ్బరాయుడుని సైతం కొంతమంది దుండగులు రాళ్లతో చాలా కిరాతకంగా కొట్టి చంపేసినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా 40 మంది దుండగులు సైతం ఈ దాడికి పాల్పడినట్లుగా సమాచారం. సీతారామపురం గ్రామానికి చెందిన కొంతమంది టిడిపి నాయకులు తన భర్తను సైతం హతమార్చాలంటూ వైసీపీ నేత సుబ్బరాయుడు భార్య ఆరోపిస్తోంది. అయితే మృతుడు సుబ్బరాయుడు మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపానికి మంచి అత్యంత సన్నిహితుడు అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ పరిణామం తోనే ఈ హత్య జరిగి ఉండవచ్చు అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిగా బయలుదేరి గ్రామంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా పీకేటును ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది.అనంతరం ఆ మృతదేహాన్ని కూడా పోస్టుమార్టంకి నంద్యాల ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. దీంతో ఈ దర్యాప్తు కూడా వేగవంతం చేస్తున్నారు పోలీసులు. ఒక్కసారిగా సుబ్బరాయుడు హత్యతో ఆ గ్రామ ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురవుతున్నారట. ఈ గ్రామాన్ని కూడా ఎస్పీ అదిత్ రాజ్ సింగ్ ఆధ్వర్యంలోనే ఈ గ్రామాన్ని ఉంచినట్లుగా తెలుస్తోంది.త్వరలోనే నిందితులను కూడా పట్టుకుంటామంటూ డిఎస్పి రవీందర్ రెడ్డి తెలియజేశారు. అయితే ఎన్నికలలో ఓటు వేయను అందుకే ఇలాంటి హత్య రాజకీయాలు జరిగినట్లు తెలుస్తోంది. మరి అసలు విషయం ఏంటన్నది అధికారులు తెలుస్తారమో చూడాలి.