అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున కమలా హరిస్ అభ్యర్థిత్వం అధికారికంగా ఖరారైంది. ఈ తరుణంలో కమలా హరిస్ భర్త సంచలన వాక్యాలు చేశారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హరిస్ భర్త డగ్లస్ ఎమ్ హోఫ్ తనకు గతంలో వివాహేతర సంబంధం ఉన్నట్లు అంగీకరించారు. తన మొదటి వివాహం జరిగిన సమయంలో తనకి వివాహేతర సంబంధం కలిగి ఉందని పేర్కొన్నారు.
ఈ వార్తల నేపథ్యంలో తాజాగా ఆయన స్పందించారు. ఆ మహిళ ప్రెగ్నెంట్ అయిందని.... ఆ గర్భాన్ని ఉంచుకోలేదని బ్రిటిష్ మీడియా తన కథనంలో పేర్కొంది. అప్పటికే కెరిస్టిన్ ను ఎమ్ హోఫ్ పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు సంతానం ఉన్నారని చెప్పారు. ఇక కమలా హారిస్, హెమ్ హోఫ్ 2014 లో వివాహం చేసుకున్నారు. కమలా హరిస్ కు ఇది మొదటి వివాహం కాగా.....ఎమ్ హోఫ్ కు రెండవది.
అతడి వివాహేతర సంబంధం గురించి తన భార్యకు ముందే తెలుసని సీఎన్ఎన్ పేర్కొంది. డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా కమలహారిస్ పేరు ఖరారైన విషయం ప్రతి ఒక్కరికి తెలిసింది. ఆమె ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కమలహారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మధ్య సెప్టెంబర్ 4వ తేదీన డిబేట్ జరిగే అవకాశం ఉంది. కాగా కమలా హరిస్ భర్త చేసిన ఆ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.