ఈ ఎయిర్‌లైన్ 15 అంతర్జాతీయ, 32 దేశీయ గమ్యస్థానాలకు తగ్గింపులు అందిస్తోంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో ‘ఎక్స్‌ప్రెస్ లైట్’ అనే ప్రత్యేక ఆఫర్ ఉంది. ఈ ఆఫర్‌లో బ్యాగేజీ ఛార్జీలు చెల్లించకుండా ప్రయాణించవచ్చు. అంటే, చేతిలో తీసుకెళ్లే చిన్న సామాను తప్ప, పెద్ద సూట్‌కేసులు తీసుకెళ్లడానికి అదనంగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. airindiaexpress.com వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటే మాత్రమే ఈ ఆఫర్ లభిస్తుంది.
అంతేకాకుండా, ఈ ఆఫర్‌లో అదనంగా 3 కిలోల బరువు ఉండే హ్యాండ్ లగేజ్ ని తీసుకెళ్లడానికి ఉచితంగా బుక్ చేసుకోవచ్చు. పెద్ద సూట్‌కేసు తీసుకెళ్లాలనుకుంటే, దేశీయ విమానాలలో 15 కిలోల బరువు ఉన్న సూట్‌కేసుకు రూ.1000, అంతర్జాతీయ విమానాలలో 20 కిలోల బరువు ఉన్న సూట్‌కేసుకు రూ.1300 చెల్లించాలి. ఇది సాధారణ ధర కంటే తక్కువ.
ఈ ఎయిర్‌లైన్‌ను ఎక్కువగా వాడుతుంటే, లాయల్టీ మెంబర్‌గా కూడా చేరవచ్చు. తద్వారా ప్రత్యేక ఆఫర్లు లభిస్తాయి. వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటే 8% వరకు డిస్కౌంట్లు లభిస్తాయి. బిజినెస్ క్లాస్, ప్రీమియం సీట్లు, హాట్ మీల్స్, పానీయాలు, అదనపు సౌకర్యాలపై కూడా తగ్గింపులు లభిస్తాయి. కేవలం లాయల్టీ మెంబర్లకే కాదు, విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు, చిన్న వ్యాపారాలు, డాక్టర్లు, నర్సులు, సైనికులు, వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేక డిస్కౌంట్లు లభిస్తాయి.