ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వయసు ఎప్పుడో పైబడిన ఇప్పటికీ చాలా తరచుగా రోజుకు 18 గంటల వరకు పని చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. అలసట లేని వ్యక్తిగా అందరికీ ఇన్‌స్పైరింగ్‌గా నిలుస్తున్నారు. మెరుగైన పరిపాలన, పాలన కోసం తన తీరిక లేకుండా కష్టపడుతున్నారు. 2024 ఎన్నికల్లో గెలవడంతో ఆయన ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టారు. ప్రజలతో మమేకమవుతూ సంక్షేమం, అభివృద్ధిని సమతుల్యం చేయాలని బాబు నిశ్చయించుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలతో మమేకమయ్యేందుకు, వారి ఫిర్యాదులను పరిష్కరించేందుకు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వారానికి ఒకరోజు అందుబాటులో ఉంటున్నారు. ప్రజా ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసి, దానిని చంద్రబాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ శనివారం రాష్ట్ర నలుమూలల నుంచి వందలాది మంది ప్రజలు మంగళగిరి కార్యాలయానికి తరలివచ్చి సీఎంను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు.  

బాబు చాలా మందితో సంభాషిస్తూ, వారి బాధలను ఓపికగా విన్నారు. విరామం తీసుకోకుండా మూడు గంటలకు పైగా సమయాన్ని కేటాయించి, ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపారు. వృద్ధులు, వికలాంగులను వ్యక్తిగతంగా సంప్రదించి, వారి సమస్యలను పరిశీలించి, సత్వర ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో చంద్రబాబు మూడు గంటలకు పైగా నిల్చునే ఉన్నారు. ఒక్క నిమిషం కూడా ఆయన కుర్చీలో కూర్చోవడము లేదంటే రెస్ట్ తీసుకోవడమో చేయలేదు.

బాబులో ఉన్న ఇంత స్టామినాను చూసి ఆఫీసు సిబ్బంది ఆశ్చర్యపోయారు. 74 ఏళ్ళ వయసులో గంట నిల్చోడమే గగనం. ఇక ఓపికగా అందరినీమాట్లాడటం మరింత కష్టం. కానీ చంద్రబాబు మాత్రం వయసు అయిపోయినా కుర్రాళ్లకు పోటీగా ఫిజికల్ స్టామినా చూపిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ఆయనకు ప్రజాదరణ ఎప్పటికీ తగ్గదు. 2024 ఎన్నికల ప్రచారంలోనూ బాబు తన గొప్ప స్టామినాను చూపించారు, విరామం లేకుండా రాష్ట్రమంతా పర్యటించాడు. గంటల తరబడి నిలబడి సుదీర్ఘ ప్రసంగాలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: