ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన విమర్శలు చేయడం జరుగుతోంది.. రాష్ట్రంలో ప్రజాస్వామ్య సర్కార్ స్థానంలో ప్రస్తుతం  ముఠాపాలన నడుస్తోంది అన్నట్టుగా తన ట్విట్టర్ నుంచి ఒక పోస్ట్ షేర్ చేయడం జరిగింది. గడిచిన రెండు నెలలలో ఆంధ్రప్రదేశ్ అంటే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయింది అంటూ తెలియజేస్తున్నారు. ఇప్పటికీ కూడా పరిస్థితులలో ఎలాంటి మార్పు రావడంలేదని సర్కార్ పెద్దల ప్రోత్సాహంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అంటూ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలియజేస్తున్నారు.


అధికారం ఉందని ధీమాతో చేస్తున్న ఈ దాడులు, రాజకీయ దృశ్యాలు రాష్ట్రంలో ప్రతిరోజు ప్రజలు చూస్తూనే ఉన్నారు అంటూ తెలిపారు. నంద్యాల జిల్లాలో గత రాత్రి జరిగిన హత్యకు, ఎన్టీఆర్ జిల్లాలో జగ్గయ్యపేటలో జరిగినటువంటి ఈ దాడికి సైతం నిదర్శనాలు అంటూ మాజీ సీఎం జగన్ ఒక ట్విట్ చేయడం జరిగింది. ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు నెరవేర్చకుండా కేవలం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారంటూ తెలియజేస్తున్నారు.


హామీల పైన ఎవరు ప్రశ్నించకూడదని రోడ్డుపైకి రాకూడదంటూ ప్రజలకు నాయకులను కార్యకర్తలను సైతం భయభ్రాంతులకు గురి చేసేలా దుర్మార్గమైన పాలన చేస్తున్నారంటూ ఈ దారుణాలకు బాధితులకు అండగా ఉంటూ కచ్చితంగా పోరాటం కొనసాగిస్తానంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక ట్విట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్విట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. అధికారం ఎప్పుడూ కూడా ఒకరి వైపే ఉండదు.. అంటూ గతంలో కూడా ఎన్నో సందర్భాలలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. కూటమి 2024లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కువగా హత్య రాజకీయాలు జరుగుతున్నాయని ఆ విధంగా వైసిపి నేతల సైతం ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.. వీటి పైన వంగలపూడి అనిత ( హోమ్ మినిస్టర్) వివరణ ఇస్తూనే ఉన్నది. జగన్ ట్విట్ పైన ఆటు టిడిపి నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: