- ఏపీలో మారిన పార్టీ నాయకుల తీరు.
- అభివృద్ధిని మూలన వేసి రివేంజ్  తీర్చుకోవడమే లక్ష్యమా.?
- కార్యకర్తలారా కాస్త ఆలోచించరా.?


ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంటేనే చాలా డిఫరెంట్ గా సాగుతాయి. ఎక్కువగా కుల ప్రాతిపదికన సాగే రాజకీయాల్లో సాధారణంగా నష్టపోయేది కార్యకర్తలు మాత్రమే. పై స్థాయిలో ఉండే నాయకులు వారి రాజకీయ అవసరాలకు ఏ పార్టీలోకైనా వెళ్లొచ్చు కానీ కార్యకర్తలు మాత్రమే నీది ఆ పార్టీ నాది ఈ పార్టీ అంటూ కొట్టుకు చస్తారు. ఈ భూమిపై పుట్టినప్పుడు పార్టీ కండువా మెడలో వేసుకునే మీరు పుట్టారా.. మీ రక్తంలో నీది ఆ పార్టీ, నాది ఈ పార్టీ అని రాసి ఉందా. లేదంటే మన ఆపోజిట్ పార్టీ వారు బ్లడ్ ఇస్తే మనకేమైనా సెట్ కాదా.. మధ్యలో వచ్చినటువంటి ఈ పార్టీల కోసం మనమెందుకు కొట్టుకు చావాలి.. కొట్టుక చచ్చే రాజకీయాల కోసం ఉన్న జీవితాన్ని ఎందుకు పాడు చేసుకోవాలని చాలామంది రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఏపీ పాలిటిక్స్ లో ఎక్కువగా రివేంజ్ రాజకీయాలు నడుస్తూ ఉంటాయి. జగన్ గెలిచినప్పుడు చంద్రబాబు పార్టీపై రివెంజ్ తీసుకుంటారు. చంద్రబాబు గెలిస్తే జగన్ పార్టీపై రివెంజ్ తీసుకుంటూ ఉంటారు ఇలా ఒకరిపై ఒకరు రివెంజ్ తీసుకుంటూ ఒక వర్గం ప్రజలను మాత్రం తప్పనిసరిగా తిప్పల పెడతారు అనేది జగమెరిగిన సత్యం. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం..

జగన్ చంద్రబాబు జగడం:
ఏపీతో తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత మూడుసార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో 2014 ఎన్నికల్లో చంద్రబాబు విజయం సాధించగా, 2019 ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ప్రస్తుతం 2024 ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. 2019లో జగన్ 151 యొక్క స్థానాలు గెలుచుకుని అద్భుతమైన మెజారిటీ సాధించారు. ఈ తరుణంలో చాలామంది టీడీపీ కార్యకర్తలపై నాయకులపై రివెంజ్ తీసుకున్నారు. ముఖ్యంగా టిడిపి కార్యాలయపై దాడులు చేయడం, కార్యకర్తలను హింసించడం, చివరికి చంద్రబాబును కూడా అసెంబ్లీలో హేళన చేయడం ఇలా ఒక్కటేమిటి ఎన్నో అవహేళన పనులు చేశారు. కార్యకర్తల మధ్య వచ్చే గొడవలు మాటల్లో చెప్పలేం. ఒకరికొకరు కొట్టుకోవడం కాదు కొట్టుకు చచ్చారు కూడా..

అలా కొనసాగుతూ వస్తున్న తరుణంలో 2024 ఎలక్షన్స్ లో టిడిపి కూటమి అద్భుతమైన మెజారిటీతో గెలుపొందింది. దీంతో వైసీపీ కార్యకర్తలపై రివేంజ్ తీర్చుకుంటున్నారు టిడిపి తమ్ముళ్లు. ఇప్పటికే వైసీపీ కార్యాలయాలపై దాడులు చేయడం, నాయకులను తిట్టడం ఇలా ఎన్నో చేస్తున్నారు. అంతేకాదు జగన్ చేసినటువంటి అభివృద్ధి పనులలో జరిగినటువంటి అవినీతిని వెలికి తీసేందుకు కమిటీని వేయడం ఇలా ఒక్కటేమిటి పూర్తిగా జగన్ పార్టీని లేకుండా చేయడానికి చంద్రబాబు పెద్ద ప్లాన్ వేస్తున్నారు. ఒక పార్టీ గెలిస్తే మరో పార్టీని తిట్టిపోయడం ఏపీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తంతు. ఇది మిగతా రాష్ట్రంలో కూడా ఉంటుంది కానీ ఏపీలో ఉన్నంత మిగతా రాష్ట్రాల్లో ఉండదనేది జగమెరిగిన సత్యం. ఇప్పటికైనా కార్యకర్తలు చేంజ్ అయి రాజకీయ నాయకులంతా ఒక్కటే, మనం మాత్రమే ఎందుకు కొట్టుకు చావాలి అని ఆలోచన చేసుకొని నాయకులను ప్రశ్నించి అభివృద్ధి వైపు మళ్లేలా చేయడమే మన లక్ష్యమని తెలుసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: