• ఏపీలో రివేంజ్ పాలిటిక్స్ స్టార్ట్ చేసిన జగన్ 

జగన్ చేసిన దానికంటే ఎక్కువ ప్రతీకారం తీర్చుకుంటున్న టీడీపీ నేతలు 

• వలస పోతున్న కార్యకర్తలు 

(ఏపీ - ఇండియా హెరాల్డ్)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెట్టారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. అందరినీ అరెస్ట్ చేయిస్తూ, భవనాలను కూల్చేస్తూ టీడీపీ నేతలకు చుక్కలు చూపించారు. ఇక వైసీపీలో ఉన్న కీలక నేతలు చంద్రబాబు అండ్ టీమ్‌ని బాగా టార్గెట్ చేశారు. వారిని దారుణంగా అవమానించారు. మళ్లీ గెలుపు తమదే అనే ధీమాతో కొందరు అవినీతి, అక్రమాలకు కూడా పాల్పడ్డారు. కానీ ప్రజలు జగన్‌ను దారుణంగా ఓడించారు.

గత ఐదేళ్లలో జగన్ పెట్టిన టార్చర్ ను లోకేష్ మర్చిపోలేదు. ఒక రెడ్ బుక్ తయారు చేసుకుని అందరి అంతు చూస్తానని ఎన్నికల ప్రచారంలో వార్నింగ్ ఇచ్చారు అధికారంలోకి వచ్చాక చెప్పినట్లుగానే అందరిపై రివేంజ్ తీర్చుకుంటున్నారు. నిజానికి చంద్రబాబు సంక్షేమ పథకాల హామీ విషయంలో కాంప్రమైజ్ అవుతారేమో కానీ శాంతిభద్రతల విషయంలో మాత్రం రాజీ పడరు. లా అండ్ ఆర్డర్ ఎప్పుడూ కంట్రోల్ లో ఉంచుతారు. ఈ విషయంలో ఆయన చాలా స్ట్రిక్ట్ కానీ ఈసారి మాత్రం అలా ఉండటం లేదని తెలుస్తోంది. జనసేన, టీడీపీ నేతలు కలిసి వైసీపీ కార్యకర్తలకు క్రైమ్ థ్రిల్లర్ చూపిస్తున్నారు. వైసీపీ కోసం బాగా పనిచేసిన వారిపై దాడులు చేస్తూ వారు ప్రాణ భయంతో వణికి పోయేలాగా చేస్తున్నారు. 

అన్ని రోజులూ మీదే అధికారం కాదు అంటూ జగన్ వారిని భయపెట్టాలని ఈ దాడులను ఆపాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అయినా అవి ఆగడం లేదు. ఇంతకుముందు రషీద్ అనే ఒక వైసీపీ కార్యకర్తను టీడీపీ నేత చంపేశారు. అదీ నడిరోడ్డుపై! అతను వైసీపీ కార్యకర్తా లేదా అనే విషయం తర్వాత సంగతి కానీ ఏపీలో శాంతిభద్రతలు దారుణంగా క్షీణించాయని ఈ సంఘటనతో స్పష్టమైనది. 

చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే వైసీపీ కార్యకర్తల ఇళ్లలోకి వెళ్లి సామాన్లు ధ్వంసం చేయడం, వారిపై అటాక్స్‌ చేయడం వంటి ఘటనలు కూడా వెలుగు చూశాయి. జగన్ చేసిన దానికి ప్రతీకారంగానే వీళ్ళు ఈ పనులు చేస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది. కక్ష సాధింపు, రివేంజ్ పాలిటిక్స్ స్టార్ట్ చేశారు జగన్. ఆయన చేసిన తప్పుల వల్ల ఇప్పుడు వైసీపీ నేతలతో పాటు కార్యకర్తలు కూడా చాలా ఇబ్బందులను అనుభవిస్తున్నారు. వైసీపీ మూకలు కూడా గతంలో చాలా దాడులు చేశాయి. కొందరు ఏపీలో బతకడం కష్టమని భావించి ప్రాణాలను గుప్పిట్లో పట్టుకొని ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. పోలీసుల నుంచి కూడా రక్షణ కరువైందని వాళ్ళు ఇలా చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: