ప్రజల తరపున తమ అధినేత రాహుల్ గాంధీ పోరాడుతున్నారని.. ప్రజలకు మేలు చేసే విధంగానే మోదీ ప్రభుత్వం పని చేయాలంటూ తెలియజేశారు. రాహుల్ గాంధీ అనే అగ్నిపర్వతాన్ని.. సిబిఐ, ఈడి అధికారులతో కక్షపూరితంగా తాకే ప్రయత్నం అయితే మళ్లీ చేస్తున్నారు. దీంతో కచ్చితంగా మసికాక తప్పదంటూ రఘువీరారెడ్డి హెచ్చరించడం జరిగింది మోడీని.. ఎక్కడ ఇబ్బందులు ఉంటే కచ్చితంగా అక్కడ రాహుల్ గాంధీ పర్యటిస్తూ ధైర్యాన్ని సైతం ఇస్తున్నారంటూ తెలిపారు.
మణిపూర్ లో రెండుసార్లు పర్యటించి అక్కడ బాధితులకు సైతం తాను ఉన్నానంటూ భరోసా ఇస్తున్నారనే విషయాన్ని కూడా రఘువీరారెడ్డి గుర్తు చేశారు.. అలాగే కేరళలోని వయనాడ్ లో వరదల బీభత్సరం గురించి చెప్పాల్సిన పనిలేదు అక్కడ కూడా రాహుల్ ప్రియాంక గాంధీ అక్కడ బాధితులను సైతం పరామర్శించి వారిలో ధైర్యాన్ని సైతం నింపేందుకే ప్రయత్నిస్తూ ఉన్నారని.. ఇలాంటి పని మోదీ ఒకతైన చేశారా అంటూ తెలియజేస్తున్నారు రాహుల్ గాంధీని ఇబ్బంది పెడితే కచ్చితంగా ప్రజలను ఇబ్బంది పెట్టినట్టుగానే ఉంటుంది అంటూ మోడీ పైన మాజీమంత్రి రఘువీరారెడ్డి విమర్శల సైతం చేస్తున్నారు. మరి వీటి పైన బిజెపి నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.