ఒకప్పుడు అమెరికాను ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, సూపర్ పవర్ నేషన్ అని పిలిచేవారు. కానీ ఇప్పుడు అలాంటి టైటిల్స్ అన్ని అమెరికా కోల్పోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ దేశ పరిస్థితి బాగా దిగజారుతోంది. సాధారణంగా పెద్దన్నయ్య అని పిలిచే అమెరికా ఏవైనా రెండు దేశాలు గొడవపడితే వెంటనే జోక్యం చేసుకుంటుంది. యూఎస్ ఆర్మీని పంపించడం, ఆయుధాలను అందించడం వల్ల అమెరికా ఖజానాకు చిల్లు పడుతోంది. స్టాక్ మార్కెట్ కూడా అతలాకుతలమవుతోంది. అక్కడ నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇన్‌ఫ్లేషన్‌ శరవేగంగా పెరిగిపోతోంది.

మాజీ అమెరికా జాతీయ రక్షణ సలహాదారు కాండోలిజా రైజ్ కూడా వేరే దేశాల యుద్ధాలలో జోక్యం చేసుకోవడం వల్ల నష్టం కలుగుతుందని హెచ్చరించారు. అయినా యూఎస ఇరాక్-కువైట్, ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ యుద్ధంలో వేలు పెట్టింది. ఐసిస్‌ని అంతం చేయాలని ఇరాక్, సిరియా వంటి దేశాల్లో పెద్ద వార్ చేపట్టింది. ఈ యుద్ధాలు చేసినప్పుడు అమెరికా సూపర్ పవర్ నేషన్ గానే ఉంది. అందుకే పీస్ మేకర్ గా వ్యవహరించింది. ప్రస్తుతం ఇజ్రాయేల్-ఇరాన్ యుద్ధానికి సై అంటూ ఒకదాని ఒకటి గెలుక్కుంటున్నాయి.

ఇజ్రాయేల్, అమెరికా దేశాలు మంచి స్నేహితుల అన్న సంగతి తెలిసిందే. ఇరాన్‌కు సంబంధించిన చాలామందిని ఇజ్రాయేల్ చంపేసింది. దాంతో ఇరాన్  ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చింది అంతే కాదు దాడులు చేయడానికి సిద్ధమయ్యింది. ఒకవేళ దాడులు మొదలైతే అమెరికా ఇజ్రాయేల్ కి మద్దతుగా యుద్ధంలో పాల్గొంటుందా అనేది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది. ఇరాన్ తోటి దేశాలతో కలిసి పోటెత్తితే అమెరికా ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతింటుంది. ఇప్పటికే అక్కడి ప్రజలు ధరలు భరించలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు.

 యుద్ధం వల్ల ఈ దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది స్టాక్ మార్కెట్ మరింత పతనం అవుతుంది. ఈ సంవత్సరం జరగనున్న అధ్యక్ష పదవి ఎన్నికల్లో ట్రంప్ లేక కమలా హారిస్ గెలిచినా అమెరికాని వెంటనే ఇష్టమైన పరిస్థితుల నుంచి కాపాడలేరు. ఇక్కడ ఉద్యోగులు తమ జాబ్స్ కోల్పోతున్నారు. ఇక ఇండియన్స్ అక్కడ చదువుకుంటున్నారు కానీ సెటిల్ కాలేక తిరిగి ఇండియాకి వస్తున్నారు. డాలర్ వాల్యూ ఎక్కువగా ఉంది తప్ప అక్కడ బతకడానికి పరిస్థితులు ఏమీ బాగోలేదు.

ఇతర దేశాలు డాలర్ వాడటం మానేసి సొంత దేశపు కరెన్సీతోనే ట్రేడ్స్ చేస్తున్నాయి. భారత్ కూడాఉంది. రూపాయిని బలోపేతం చేయడానికి సొంత కరెన్సీనే వాడుతోంది. ఇంతకుముందు అమెరికా అంటే చాలా దేశాలు భయపడిపోయాయి కానీ ఇప్పుడు అమెరికాను కొంచెం కూడా లెక్కచేయకుండా తమకు నచ్చినట్లు దేశాలు ప్రవర్తిస్తున్నాయి. రష్యా ఇప్పటికే అమెరికాని గుడ్డు మీద ఈకలా తీసి పడేసింది. ఇరాన్ కూడా దాన్ని లెక్క చేయడం లేదు. అమెరికాని మళ్లీ సూపర్ పవర్ నేషన్ గా మార్చగలరా అనేది నెక్స్ట్ అధ్యక్షులపై ఆధారపడి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

USA