ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిరోజు నిర్వహిస్తున్నటువంటి ప్రజాదర్బార్ కు హాజరవుతూ ఉన్నారు.ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు సైతం తమ సమస్యలను తెలియజేస్తూ ఉన్నారు. అయితే ప్రజల నుంచి వస్తున్నటువంటి ఈ సమస్యలు చూసి ఏపీ సీఎం చంద్రబాబు షాక్ అయ్యారట.. ముఖ్యంగా ఎక్కువగా భూములకు సంబంధించిన వివాదాలు భూ కబ్జాలు విషయంపైనే ఎక్కువగా సమస్యలు తలెత్తుతున్నాయని గతంలో వైసిపి నేతల ఆగడాలకు సంబంధించి కేసులు విషయమే ఎక్కువగా వస్తున్నాయట. ఈ విషయాలన్నీ తెలుసుకున్న సీఎం చంద్రబాబు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నట్లు సమాచారం.


ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఎక్కడ ప్రజా దర్బార్ పెట్టిన కూడా పెద్ద ఎత్తున ప్రజలు కంప్లైంట్ ఇవ్వడానికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఎక్కువగా వైసిపి నాయకులు భూములను ఆక్రమించుకున్నారనే పెద్ద ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆధారాలు కూడా అందుకు చూపిస్తున్నారట ప్రజలు. దీంతో అసలు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది అనే అంశం పైన ఏపీ సీఎం ప్రస్తుతం ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.. ఇలాంటి సమయంలోనే ఇద్దరు ఐపీఎస్, ఇద్దరు ఐఏఎస్ లతో ఒక కమిటీని సైతం ఏర్పాటు చేసి మరి నిర్ణయాలు తీసుకోబోతున్నారు.


అయితే భూముల వివాదాలకు సంబంధించి సమస్యలను పరిష్కరించాలనే విధంగా తీసుకున్నందుకు ఏపీ సీఎం సిద్ధమయ్యారు. ఇప్పుడు తాజాగా మాజీ సీఎం జగన్ సొంత నియోజక వర్గం పులివెందులలో వైఎస్ జగన్కు సంబంధించిన బంధువులు తమ భూమిని ఆక్రమించారంటూ ఫిర్యాదులో చంద్రబాబుకి తెలియజేయడంతో ఆశ్చర్యపోయారట.. నిజానికి వైయస్ కుటుంబానికి కంచుకోట పులివెందలని చెప్పవచ్చు. ఇప్పటివరకు ఎలాంటి ఆరోపణలు కూడా ఇక్కడ రాలేదు అలాంటిది వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా చేయడంతో ఒక మహిళ కన్నీరు పెట్టుకుందట. ఈ సన్నివేశం ఏపీ సీఎంను కల్చవేసిందని దీనిపైన ఎలా ముందుకు వెళ్లాలో తెలియక సతమతమవుతున్నారట. ఇలా ఒక పులివెందులలోనే కాదు అనంతపురం నెల్లూరు ఇతర ప్రాంతాలలో కూడా చాలానే వెలుగులోకి వస్తున్నాయి. మొత్తానికి ప్రజా దర్బార్ తో ఏపీ సీఎంకు ఒక తలనొప్పిగా మారుతున్నది

మరింత సమాచారం తెలుసుకోండి: