వాస్తవానికి జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు టీచర్లు చాలా కష్టపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోతే తమకు న్యాయం జరుగుతుందని టీచర్లు భావించి... కూటమి ప్రభుత్వ విజయానికి చాలా కృషి చేశారు టీచర్లు. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన కూడా ఏపీ టీచర్ల పరిస్థితి అత్యంత దారుణంగా తయారయిందని ఇప్పుడు.. ప్రచారం జరుగుతోంది.
ఆగస్టు 4వ తేదీ అంటే ఆదివారం రోజున.. టీచర్లకు సెలవు దినం ఇవ్వలేదు. వర్కింగ్ డే గా ప్రకటించింది చంద్రబాబు ప్రభుత్వం.దీంతో.. ఏపీ టీచర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగే.. చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. అయితే మీడియం ముందుకు వచ్చి చెప్పడం లేదు కానీ సోషల్ మీడియాలో.. దీనిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఆదివారం రోజున ఉన్నఫలంగా హాలిడే కాకుండా.. వర్కింగ్ డే పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు టీచర్లు.
సెలవు రోజున వర్కింగ్ డే పెట్టి మానసికంగా వేధిస్తున్నారని టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అలాగే 117 జీవో పైన కూ డా ఏపీ టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల హామీల్లో తెలుగుదేశం కూటమి 117 జీవోను కొట్టివేస్తామని హామీ ఇచ్చింది. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దాన్ని సర్దుబాటు చేస్తోంది. కానీ జీవో ను మాత్రం రద్దు చేయడం లేదు. దీనిపైన కూడా ప్రభుత్వ టీచర్లు మండిపడుతున్నారు. మరి దీనిపై చంద్రబాబు నాయుడు ఎలా స్పందిస్తారో చూడాలి.