* కుటుంబ రాజకీయాలకే ఆంధ్రప్రదేశ్ లో పెద్ద పీట..

* జనసేన పార్టీతో రాష్ట్ర రాజకీయాలనే మలుపు తిప్పిన పవన్ కళ్యాణ్

* పవన్ కు సపోర్ట్ గా నిలిచిన మెగా కుటుంబం..

* ఐకాన్ స్టార్ చేసిన ఆ ఒక్క మిస్టేక్ కెరీర్ నే రిస్క్ లో పడేసిందిగా..?



ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుటుంబ రాజకీయాలు ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వైఎస్ఆర్, నందమూరి, నారా, మెగా కుటుంబాల నుండి నాయకులు పుట్టుకొచ్చారు. ప్రస్తుతం ఈ కుటుంబాల నుండి వచ్చిన నాయకులే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నారు. సినీ రంగంలో నందమూరి, మెగా కుటుంబాలకు ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు సినీ రంగంలో ఓ వెలుగు వెలిగారు. ఆంధ్రప్రదేశ్ ఆత్మ గౌరవం కాపాడటమే ద్యేయంగా ఆనాడు తెలుగు దేశం పార్టీ స్థాపించి 9 నెలలలోనే అధికారం అందుకొని చరిత్ర సృష్టించారు. ఆ తరువాత ఆయన తనయులు హరికృష్ణ, బాలకృష్ణ, పురందేశ్వరి కూడా రాజకీయాలలో అద్భుతంగా రానిస్తున్నారు. ఇక మెగా కుటుంబ విషయానికి వస్తే టాలీవుడ్ లో మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. ప్రేక్షకులలో తనకు వున్న విశేష ఆదరణ చూసి ప్రజా రాజ్యం అనే రాజకీయ పార్టీని స్థాపించారు. అయితే రాజకీయాలు చిరుకి అంతగా కలిసి రాలేదు.ఎన్నో రాజకీయ పరిణామాల మధ్య చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి మళ్ళీ సినిమాలలో కంటిన్యూ అవుతున్నారు.


ఇక అదే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా విశేష ఆదరణ సంపాదించుకున్నారు. ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో జనసేన అనే సొంత రాజకీయ పార్టీని స్థాపించారు.. 2014 లో టీడీపీకి మద్దతు ఇచ్చిన పవన్ 2019 లో ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ సమయంలో పవన్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. వాటన్నిటిని తట్టుకొని పవన్ పార్టీని బలోపేతం చేయడంలో సక్సెస్ అయ్యారు.ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ, బీజేపీ తో పొత్తు పెట్టుకొని జనసేన అనూహ్య విజయం సాధించింది. పవన్ ఏకంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా భాద్యతలు చేపట్టారు.

ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో స్టార్ హీరో అల్లు అర్జున్.. చిరంజీవి ఫేమ్ తో అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఎదిగారు.. వరుస సినిమాలలో నటించి ప్రేక్షకులని మెప్పించారు. రీసెంట్ గా నేషనల్ అవార్డు కూడా అల్లు అర్జున్ సాధించారు. అయితే అల్లు అర్జున్ చేసిన చిన్న మిస్టేక్ అతని కెరీర్ కు మాయని మచ్చగా మారింది.. ఇటీవల జరిగిన ఎన్నికలలో మెగా ఫ్యామిలీ అంతా పవన్ కు సపోర్ట్ గా నిలిచింది. అల్లు అర్జున్ కూడా పవన్ కు సపోర్ట్ చేసారు. కానీ సపోర్ట్ చేసిన కూడా పవన్ రాజకీయ ప్రత్యర్థి అయిన వైసీపీ పార్టీ తరుపున ఎమ్మెల్యే గా పోటీ చేస్తున్న తన ఫ్రెండ్ శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్దతు ఇవ్వడానికి అల్లు అర్జున్ స్వయంగా నంద్యాల వెళ్లారు.పవన్ కి మద్దతు ఇచ్చి వైసీపీ కి ప్రచారం చేయడంతో అల్లు అర్జున్ ని సొంత అభిమానులే విమర్శించడం మొదలు పెట్టారు. పుష్ప తో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ తన కెరీర్ లోనే బిగ్ మిస్టేక్ చేసారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: