* తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్‌కు గుర్తింపు
* కేసీఆర్‌ అల్లుడిగా రాజకీయాల్లోకి హరీష్‌ రావు
* తండ్రికి తగ్గ తనయుడిగా కేటీఆర్ రాణింపు
* ఎంపీగా, ఎమ్మెల్సీగా కవిత దూకుడు



తెలంగాణ రాష్ట్రంలో.. కుటుంబ రాజకీయాలు ఇప్పటినుంచే కాదు మొదటి నుంచి కొనసాగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాజకీయ విషయాల గురించి మొదటగా మాట్లాడుకుంటే అందరికీ గుర్తు వచ్చేది  కేసీఆర్ ఫ్యామిలీనే. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం.. కేసీఆర్ కుటుంబం చేసినన్ని త్యాగాలు ఏ కుటుంబం చేయలేదని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ కుటుంబంలో ఉన్న వారంతా చాలా కృషి చేశారు.

 2001 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కోసమై టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు కేసీఆర్.  అంతకుముందు కాంగ్రెస్ అలాగే తెలుగుదేశం పార్టీల్లో పనిచేసిన కేసిఆర్... అనంతరం రాష్ట్ర సాధన కోసం నడుము కట్టారు. అయితే  ఎన్నో పోరాటాలు, పదవులకు రాజీనామాలు, నిరాహార దీక్షలు చేసిన తర్వాత తెలంగాణను సాధించుకున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత టిఆర్ఎస్ పార్టీని రాజకీయ పార్టీగా.. మార్చేసి అధికారంలోకి కూడా వచ్చారు కేసీఆర్.

దాదాపు పది సంవత్సరాలపాటు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఇప్పుడు ప్రతిపక్ష నేతగా కూడా తన వంతు పాత్రను కృషి చేస్తున్నారు. అయితే కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుటుంబం నుంచి.. ఇప్పటికే ముగ్గురు నేతలు  రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కెసిఆర్ అల్లుడు తన్నీరు హరీష్ రావు మొదటగా రాజకీయాల్లోకి వచ్చారు. అల్లుడి కోసం సిద్దిపేట సీటును త్యాగం చేశారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు.

 ఇక ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న తన్నీరు హరీష్ రావు దాదాపు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం కల్వకుంట్ల తారక రామారావు.. 2007 సంవత్సరంలో రాజకీయ అరంగేట్రం చేశారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కేటీఆర్ అప్పటి నుంచి ఓటమి ఎరుగని నాయకుడిగా ఎదిగారు. గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అలాగే మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం కేటీఆర్ కు ఉంది. ఇటు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు కవిత కూడా రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు. బతుకమ్మ పేరుతో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత... నిజామాబాద్ ఎంపీగా కూడా కవిత పనిచేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు కవిత. ఇలా నలుగురు కుటుంబ సభ్యులే తెలంగాణ రాష్ట్రంలో.. కీలక పాత్రలు పోషించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: