ఇది వరకు ఫీజుల విషయంలో కట్టడానికి వామ్మో అని అనుకునే వారము. కానీ ఇప్పుడు ప్రైవేటు విద్యాసంస్థల ఫీజులే కాదు.. ఇతరత్రా వాటితో వసూలు చేసే వాటితో విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు అదిరిపోతుంది. 17వేల రూపాయలు ఫీజ్ అని చేరిస్తే పాతికవేల రూపాయలు పై వాటికే ఖర్చవుతుంది. ఇప్పుడు తాజాగా వివిధ కార్పొరేట్ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో ఒకటవ తరగతి చదివే విద్యార్థులకు 6000 రూపాయల పుస్తకాలట. రెండవ తరగతి చదివే వారికి 6500.. మూడో క్లాస్ కి 7000 రూపాయలు.. నాలుగవ తరగతి వాళ్లకి 8 వేల రూపాయలు.. ఐదవ తరగతికి 8500 9వ తరగతి చదివే వారు అక్షరాల 9500.. అదనంగా మళ్ళీ గవర్నమెంట్ టెస్ట్ బుక్కులు బయట తీసుకోవాలట.



అలాగే యూనిఫార్మ్స్ కూడా స్కూల్లోనే అమ్ముతున్నారు.. వాళ్లు ఎంత అంటే అంత ఇవ్వాల్సి ఉంటుంది.. ఓవరాల్ గా వీటికి ఎలాంటి జవాబుదనం కూడా లేదు. వీటికి వేరే సంస్థల పేర్లు పెడతారు.. ఆ సంస్థల పేరుతో అకౌంట్లు తీస్తారు.. అన్ని వైపులా కూడా స్కూల్ యాజమాన్యాలు బ్లాక్ మనీని సంపాదిస్తున్నారు. అలాంటి విద్యాసంస్థలని మనం నెత్తిన పెట్టుకొని తిరగడమే మనకి చేటు వస్తోంది. కానీ గవర్నమెంట్ స్కూల్లో మాత్రం ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తయారుచేయడం జరిగింది.


కానీ విద్యార్థిని తల్లిదండ్రులు కూడా ఎక్కువగా ప్రైవేట్ యాజమాన్యం వైపు గాని అడుగులు వేస్తూ ఉన్నారు.. గడిచిన  ఐదు సంవత్సరాలలో ప్రభుత్వ పాఠశాలలో చేరి విద్యార్థుల సంఖ్య కాస్త పెరిగిన ఈ మధ్యకాలంలో ప్రైవేట్ పాఠశాలలో చేరి విద్యార్థుల సంఖ్య పెరుగుతోందట. ప్రజలు కూడా తమ ఎలా ఉన్నా కూడా తమ పిల్లలు మాత్రం పై చదువులు చదవాలని ఉద్దేశంతోనే కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో నైనా ప్రైవేటు స్కూల్లో దండా విషయంలో గవర్నమెంట్ ఏవిధంగా చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: