* వైఎస్‌ఆర్‌ అడుగు జాడల్లో నడిచిన బొత్స
* వైఎస్‌ఆర్‌, జగన్‌ కేబినేట్‌ లో మంత్రి పదవులు
* బొత్స భార్య ఝాన్సీ కూడా రాజకీయాల్లో రాణింపు



 రెండు తెలుగు రాష్ట్రాలలో కుటుంబ రాజకీయాలు చాలా కామన్. ఒక్కరు రాజకీయాల్లో సక్సెస్ అయ్యారంటే వారి కుటుంబంలో ఉన్న వ్యక్తులు వన్ బై వన్ రాజకీయాల్లోకి వస్తారు. అన్న గాని, తమ్ముడు లేదా కొడుకు ఎవరో ఒకరు.. రాజకీయాల్లోకి వచ్చి రాణిస్తూ ఉంటారు. అయితే..  బొత్స సత్యనారాయణ కుటుంబం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో.. కీలక బాధ్యతలను చేపట్టింది. ముఖ్యంగా బొత్స సత్యనారాయణ.. చాలా సీనియర్ రాజకీయ నాయకులు.

 ఆయన మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉండి... ఎన్నో పదవులను చేపట్టారు. 2015 సంవత్సరంలో... కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరారు బొత్స సత్యనారాయణ. ఇక అప్పటి నుంచి వైసీపీలోనే ఉన్నారు బొత్స సత్యనారాయణ. 1999లో ఎన్డీఏ హవా ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున... బెబ్బులి నియోజక వర్గం నుంచి ఎంపీగా గెలిచారు బొత్స సత్యనారాయణ. ఆ తర్వాత చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా 2004, 2009లో విజయం సాధించారు.

 ఇక వైయస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో మంత్రిగా కూడా పని చేశారు బొత్స సత్యనారాయణ. అయితే వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత కాంగ్రెస్లో కొంతకాలం ఉండి వైసీపీలో చేరారు బొత్స. జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో కూడా బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉన్నారు. అయితే 2024 ఎన్నికల్లో కూడా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బొత్స సత్యనారాయణ ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు బొత్స.

 బొత్స భార్య ఝాన్సీ కూడా రాజకీయాల్లో రాణిస్తున్నారు. బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ 2001 సంవత్సరంలో విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా పని చేశారు. బొబ్బిలి నుంచి... ఎంపీగా కూడా ప్రాతినిధ్యం వహించారు ఝాన్సీ లక్ష్మి. 2009 ఆ సమయంలో విజయనగరం ఎంపీగా కూడా ఆమె ప్రాతినిధ్యం వహించారు. బొత్స తమ్ముడు అప్పల నరసయ్య కూడా రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు.2009 సంవత్సరంలో గజపతినగరం.. మంచి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. అయితే 2024 ఎన్నికల్లో మాత్రం... బొత్స కుటుంబంలో అందరూ ఓడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: