సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన చంద్రబాబు నాయుడు 1978 సంవత్సరంలో చంద్రగిరి నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్ లో చిన్న వయస్సులోనే చంద్రబాబు నాయుడు మంత్రి పదవిని సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత రోజుల్లో మారిన పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు తెలుగుదేశంలో చేరి ఆ పార్టీలో కీలక పాత్ర పోషించారు.
1995 సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీన ఆయన ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ఆ సమయంలో దేశ రాజకీయాల్లోనే చంద్రబాబు తన రాజకీయ చాతుర్యంతో వార్తల్లో నిలిచారు. 1995 నుంచి 2004 వరకు తొమ్మిదేళ్ల పాటు సీఎంగా చంద్రబాబు నాయుడు కొనసాగారు. అయితే వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల చంద్రబాబు నాయుడు 2004 ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు.
2014, 2024 ఎన్నికల్లో చంద్రబాబు టీడీపీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు కొడుకు నారా లోకేశ్ 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. రాజకీయాలలో నారా ఫ్యామిలీ ఔరా అనిపించిందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. నారా ఫ్యామిలీ పేరు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బ్రాండ్ గా మారిందని చెప్పడంలో సందేహం అవసరం లేదు. నారా ఫ్యామిలీ రాబోయే రోజుల్లో రాజకీయాల్లో మరిన్ని సంచలనాలను సృష్టించాలని ఆ పార్టీ అభిమానులు కోరుకుంటున్నారు. వయస్సు పెరుగుతున్నా చంద్రబాబులో ఎనర్జీ లెవెల్స్ మాత్రం తగ్గడం లేదు.