తెలంగాణలో మంచి గుర్తింపు పొందిన రాజకీయ నాయకులలో గడ్డం వివేక్ ఒకరు. ఈయన తన తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చి 2009 లో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. దానితో పార్లమెంట్ బొగ్గు , ఉక్కు కమిటీల సభ్యుడిగా ఉన్నాడు.

వివేక్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పతాక స్థాయికి చేరిన సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడి తెలంగాణ (టీఆర్ఎస్) రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. ఇక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత వివేక్ టీఆర్ఎస్ పార్టీని వీడి మళ్ళీ కాంగ్రెస్‌లో చేరాడు. ఆ తర్వాత 2014 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వివేక్ ఆ ఎన్నికల్లో ఓడిపోయాడు.

ఆ తర్వాత వివేక్ మళ్లీ 2016 లో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితుడయ్యాడు. ఇక వివేక్ 2019 లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున టికెట్ రాకపోవడంతో ఆ పార్టీకి 2019 లో రాజీనామా చేసి అదే సంవత్సరం (బీజేపీ) భారతీయ జనతా పార్టీలో చేరాడు. వివేక్ ఈ పార్టీలో కూడా ఎక్కువ కాలం కొనసాగలేకపోయాడు.

దానితో బిజెపి పార్టీ నుండి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి చేరాడు. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ వివేక్ కి మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ను ఇచ్చింది. అక్కడి నుండి పోటీ చేసిన ఈయన అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో తన కుమారుడు అయినటువంటి వంశీ ని పెద్దపల్లి పార్లమెంటు నుండి బరిలోకి దింపాలి అని అనుకున్నాడు.

అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ వివేక్ కుమారుడు వంశీ కి పెద్దపల్లి లోక్ సభ టికెట్ ను ఇచ్చింది. ఇక మొదటి ప్రయత్నంలోనే వంశీ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఇలా వివేక్ రాజకీయ వారసత్వాన్ని వంశీ ప్రస్తుతం కొనసాగిస్తున్నాడు. ఇలా వివేక్ కుమారుడు అయినటువంటి వంశీ కూడా రాజకీయాల్లో బాగానే సక్సెస్ అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: