తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ పనితీరు అస్తవ్యస్తంగా తయారైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అసలు మంత్రులు ఏం చేస్తున్నారో? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి నెలకొన్నాయని చెబుతున్నారు. మంత్రి ఒక మాట... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొక మాట చెబుతారని ప్రజల్లో ఓ స్పష్టమైన అంచనా ఉంది. దీనివల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని చెబుతున్నారు.

 

అంతేకాదు ఆరోగ్యాన్టీలు అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్... నిరుద్యోగులతో పాటు తెలంగాణ ప్రజలందరిని మోసం చేసిందని కూడా జనాల్లో గట్టి ప్రచారం ఉంది. సింపుల్ గా చెప్పాలంటే ఎనిమిది నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఉందని తేలిపోయింది.  మళ్లీ ఇప్పుడంటే ఇప్పుడు ఎన్నికలు వస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం గ్యారంటీ అని అంటున్నాయి సర్వే సంస్థలు.


అయితే ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జాకీలు పెట్టి మరి లేపుతున్నారు  ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఓనర్ రాధాకృష్ణ.  తాజాగా తన  పత్రికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కాంగ్రెస్ పనితీరుపైన స్పష్టమైన విశ్లేషణ చేశారు. ఈ విశ్లేషణ ప్రకారం రేవంత్ రెడ్డి  పాలన బాగుందని చెప్పే ప్రయత్నం చేశారు ఆర్కే. కాంగ్రెస్పై వ్యతిరేకత రావడానికి కాంగ్రెస్ లో ఉన్న మంత్రులు... ఇతర లీడర్లు అని  ఏబీఎన్ ఆంధ్రజ్యోతి  రాధాకృష్ణ స్పష్టం చేసేసారు.

 

అయితే ఒక ప్రభుత్వం వ్యతిరేకతను మూటగట్టుకుందంటే దానికి కారణం ముఖ్యమంత్రి  నిర్ణయాలు, వ్యవహార శైలి మాత్రమే. కానీ తెలంగాణ మంత్రుల వల్ల కాంగ్రెస్కు బ్యాడ్ నేమ్ వచ్చిందని... రేవంత్ రెడ్డి ని జోకే ప్రయత్నం చేశారు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి  రాధాకృష్ణ. అయితే దీని వెనుక పెద్ద కుట్రే ఉందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. చంద్రబాబు అలాగే ఆంధ్రజ్యోతి రెండు కలిసి రేవంత్ రెడ్డిని లేపుతున్నాయని... అందుకే ఇలా తప్పుడు వార్తలు రాస్తున్నారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: