ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత ఇసుక అని అంటున్నారు కానీ డబ్బుతో కొన్న ఇసుక కంటే దీని రేటు ఎక్కువగా ఉంటుంది అదేమీ అని అడిగితే ట్రాన్స్‌పోర్టేష‌న్ ఆర్జీలు  ఎక్కువగా ఉన్నాయని అధికారపక్షం వాళ్ళు జనాల నుంచి డబ్బులు దోచేస్తున్నారు అయితే చంద్రబాబుకు దీని గురించి ఫిర్యాదులు వచ్చాయి. కాగా బాబు వెంటనే సీరియస్ అయ్యారు. అందరి కలెక్టర్లకు రవాణా చార్జీలు తగ్గించాలని, లారీలు క్యూలో లేకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. అధికార పక్షం వాళ్ళు డబ్బులు అన్యాయంగా ప్రజల నుంచి తీసుకోకుండా చర్యలు చేపట్టాలని కూడా అన్నారు.

తమ వాళ్ళైనా సరే ఇసుక కొనుగోలుదారుల దగ్గర నుంచి అన్యాయంగా డబ్బులు తీసుకుంటే చర్యలు తీసుకోవాలని, ఇసుక విషయంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అవినీతి లేకుండా ఇసుక కొనుగోల విషయంలో పారదర్శకతను మెయింటైన్ చేయాలని కూడా చెప్పారు. "కన్జ్యూమర్లు సచివాలయంలో ఇసుకను బుక్ చేసుకోవాలి, రవాణా ఖర్చులను చెల్లించాలి, లారీ ఇంటికి చేరుకుందని వినియోగదారుడు చెప్పినా తర్వాతే లారీ వాళ్లకు డబ్బులు విడుదల చేసేలా లేదా ట్రాన్స్‌ఫర్ చేసేలా ఏర్పాటు చేయాలి." అని చంద్రబాబు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు ఇందులో విఫలమైన కలెక్టర్లను బదిలీ చేస్తామని కూడా హెచ్చరించారు.

"ఇసుక సరఫరా చేసే ఆసక్తి ఉన్న లారీ యజమానులు సచివాలయంలో రిజిస్టర్ చేసుకోవాలి. వినియోగదారుడు ఇసుక బుక్ చేసిన అరగంట తర్వాత ఎవరో ఒక లారీ యజమానికి సమాచారం అందిస్తాం. దాని తర్వాత లారీ యజమాని ఇసుకను లోడ్ చేసి బుక్ చేసుకున్న వ్యక్తికి డెలివరీ చేయాల్సి ఉంటుంది. డైలీ ఎంత ఇసుక అనే వివరాలను తెలుసుకుంటాం. ఇసుక పంపిణీ ప్రక్రియను కంప్యూటరైజ్‌ చేస్తాం." అని బాబు చెప్పుకొచ్చారు.చంద్రబాబు తీసుకొచ్చిన ఇసుక ఫార్ములా చాలా మందికి నచ్చింది. కిలోమీటర్ల చొప్పున రవాణా చార్జీలు అనేవి నిర్ణయించడం జరుగుతుంది. ఆచార్జీల లిస్ట్ అనేది కంప్యూటర్ రూపొందిస్తుంది ఆ లిస్టు అందరికీ అవైలబుల్ లో ఉంటుంది దాని ప్రకారం రేటు ఎంత కట్టాలో తెలుసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: