•పరిటాల శ్రీరాములు నాటిన కుటుంబ రాజకీయ బీజం

•ప్రజలకు మేలు చేయడమే ఈ కుటుంబానికి శాపం

•రాజకీయంగా చక్రం తిప్పుతున్న పరిటాల కుటుంబం..

(ఆంధ్రప్రదేశ్  - ఇండియా హెరాల్డ్ )

ముఖ్యంగా రాయలసీమ , అనంతపురం జిల్లా రాప్తాడు మండలం అనగానే వెంటనే గుర్తొచ్చే రాజకీయ కుటుంబం పరిటాల రవీంద్ర కుటుంబం. ఒకప్పుడు అనంతపురం జిల్లా పెనుగొండ శాసనసభ్యుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన 2005లో ప్రత్యర్థుల దాడిలో మరణించారు. ఆ తర్వాత ఆయన భార్య పరిటాల సునీత ప్రస్తుతం రాప్తాడు శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈయన తండ్రి  పరిటాల శ్రీరాములు కూడా ప్రజా నాయకుడిగా భూ పోరాటాలలో కొంతమంది భూస్వామ్యులు చేతుల్లో ఉన్న బంజరు భూములను సాధారణ రైతులకు పంచేలా కృషిచేసి మంచి పేరు సొంతం చేసుకున్నారు.  ఒకప్పుడు పరిటాల రవీంద్ర అంటే కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలిచే అన్న అని చెప్పవచ్చు.


మరోవైపు పరిటాల శ్రీరాములు ప్రజలకు మేలు చేయాలని రీతిలో ముందడుగు వేశారు. ఇక ఆయన నాటిన రాజకీయ కుటుంబం బీజం నాటి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా రాప్తాడు మండలానికి ఈ కుటుంబం కేరాఫ్ అడ్రస్ గా నిలిచిపోయిందని చెప్పడంలో సందేహం లేదు. శ్రీరాములు తర్వాత అంత పేరు దక్కించుకున్న పరిటాల రవీంద్ర ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టి మరింత మందికి అండగా నిలిచారు. పరిటాల రవీంద్ర జీవిత కథ ఆధారంగా ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ రక్త చరిత్ర పేరుతో ఏకంగా రెండు భాగాలుగా సినిమా తెలిసిందదే.ఈ సినిమా చూస్తే ఆయన బలం బలగాలు మనకు తెలుస్తాయి.

ఇదిలా 1975లో భూస్వాములు, ఫ్యాక్షనిస్టులు కుట్రపన్ని పరిటాల రవీంద్ర తండ్రి పరిటాల శ్రీరాములు, ఆయన తమ్ముడు పరిటాల సుబ్బయ్యని హత్య చేశారు.  తండ్రి చనిపోయే నాటికి పరిటాల రవీంద్ర వయసు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే. కుటుంబం అభద్రతాభావంతో బతుకుతున్న నేపథ్యంలో కన్న బిడ్డల కోసం గుండె ధైర్యంతో బతుకుతున్న తల్లి నారాయణమ్మ కి అండగా నిలబడ్డాడు పరిటాల రవీంద్ర.  తండ్రి అడుగుజాడల్లో పరిటాల రవీంద్ర నడిచి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు . అయితే ఈయనను కూడా కొంతమంది హత్య చేసిన విషయం తెలిసిందే..

ఈయన తర్వాత ఈయన భార్య పరిటాల సునీత రంగంలోకి వచ్చి ప్రజలకు మేలు చేశారు. ఒకప్పుడు మంత్రిగా పనిచేసిన సునీత ఇప్పుడు టిడిపి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అంతేకాదు ఈమె కొడుకు పరిటాల శ్రీరామ్ కూడా రాజకీయంగా వేగంగా దూసుకుపోతూ ప్రజలలో మంచి మన్ననలు పొందారు. మొత్తానికైతే పరిటాల రవీంద్ర కుటుంబం రాజకీయానికే పరిమితమైందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: