దేశంలో జరుగుతున్న హింసాత్మక నిరసనల ముందు బంగ్లాదేశ్ ప్రధాని మోకరిల్లిన పరిస్థితి తలెత్తింది. తన ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు.షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు, ఆమె పార్టీ అవామీ లీగ్ మద్దతుదారుల మధ్య హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో ఆమె రాజీనామా చేయక తప్పలేదు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసినట్లు మీడియా ఏజెన్సీ రాయిటర్స్ నివేదించింది.ఈ నేపథ్యంలోహసీనా పాలనలో భారత్ బంగ్లాదేశ్ మధ్య అనేక ఆర్థిక ఒప్పందాలు జరిగాయి. మగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు ప్రారంభించేందుకు భారత్‌, బంగ్లాదేశ్‌లు అంగీకరించాయని, మొత్తం సంబంధాలను పెంపొందించేందుకు భవిష్యత్తు దృష్టిని రూపొందించుకున్నాయని చెప్పారు. బంగ్లాదేశ్ భారతదేశానికి అతిపెద్ద అభివృద్ధి భాగస్వామి అని, ఆ దేశంతో సంబంధాలకు భారత్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కొత్త రంగాలలో భారతదేశం-బంగ్లాదేశ్ సహకారానికి భవిష్యత్తు దార్శనికత సిద్ధమైందని ప్రధాని మోడీ తెలిపారు. డిజిటల్ డొమైన్, మారిటైమ్ డొమైన్, రైల్వే కనెక్టివిటీ రంగాలతో సహా విస్తృత ఆధారిత సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇరుపక్షాలు పలు ఒప్పందాలపై సంతకాలు చేశాయి.రక్షణ ఉత్పత్తి, సాయుధ బలగాల ఆధునీకరణ రంగాలతో సహా రక్షణ సహకారాన్ని ప్రోత్సహించడంపై విస్తృత చర్చ జరుగుతోందని ప్రధాని తెలిపారు. ఇండో-పసిఫిక్ ఓషన్ ఇనిషియేటివ్‌లో చేరాలన్న బంగ్లాదేశ్ నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. అదే సమయంలో, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మాట్లాడుతూ.. భారతదేశం తమకు ప్రధాన పొరుగు దేశమన్నారు. నమ్మకమైన దేశమని.. ప్రాంతీయ భాగస్వామి అని కొనియాడారు. 1971 విముక్తి యుద్ధంతో ప్రారంభమైన భారత్‌తో సంబంధాలకు బంగ్లాదేశ్ చాలా ప్రాముఖ్యతనిస్తుంది. ఒప్పందంపై జల పంపకాల వివాదాలు పరిష్కరమయ్యాయి. ఇరుదేశాలు కలిపే రోడ్డు, రైల్వే ప్రాజెక్టులు వేగవంతమయ్యాయి. టెర్రరిజాన్ని అరికట్టేందుకు హసీనా మన దేశంతో కలిసి పనిచేశారు. అయితే హసీనా రాజీనామాతో మాజీ పీఎం ఖలీదా జియా పగ్గాలు చేపట్టే అవకాశముంది. ఆపార్టీ చైనా, పాకిస్తాన్ లకు అనుకూలంగా వుండటం భారత్ కు తలనొప్పి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: