( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) .

వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నా పరువు కాపాడమని సొంత పార్టీకి చెందిన నేతలను వేడుకుంటున్న పరిస్థితి. అదేంటి జగన్ తన పరువు కాపాడమని సొంత పార్టీకి చెందిన నేతలను వేడుకోవడం ఏంటి ? జగన్ సాధారణంగా ఎవరిని బ్రతిమలాడురు కదా ఎవరైనా పార్టీలో ఉంటే ఉంటారు ... పోతే పోతారు అన్న మనస్తత్వంతో ఉంటారు కదా ? అని అనుకుంటున్నారా ఇక్కడే ఉంది అసలు కథ. ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది మేలో జరిగిన సాధారణ ఎన్నికలలో అప్పటివరకు అధికారంలో ఉండి బలమైన పార్టీగా ఉన్న వైసీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. 2019 ఎన్నికలలో ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలకు గెలుచుకున్న వైసీపీకి ఆ తర్వాత జనసేన - తెలుగుదేశం పార్టీ నుంచి మరో ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా జత కలిశారు.


అలా ఎన్నికల ముందు ఏకంగా 156 మంది ఎమ్మెల్యేలతో వైసిపి చాలా బలంగా కనిపించింది .. అయితే ఎన్నికలలో పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయి కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది. ఈ 11 మంది ఎమ్మెల్యేలలో కూడా వచ్చే నాలుగైదు నెలలలో కనీసం నాలుగు నుంచి ఐదుగురు ఎమ్మెల్యే గారు జగన్కు షాక్ ఇచ్చి వైసిపికి గుడ్ బై చెప్పేస్తారు అన్న ప్రచారం జరుగుతుంది. పార్టీ ఘోరంగా ఓడిపోయిన రెండు నెలలలోనే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స‌ సత్యనారాయణ పేరు జగన్ ఖరారు చేశారు.


అయితే ఉమ్మ‌డి విశాఖ జిల్లాకు చెందిన వైసీపీ స్థానిక సంస్థ‌ల ప్ర‌జా ప్ర‌తినిధులు ఎవ్వ‌రూ కూడా వైసీపీ కి ప‌ని చేసేందుకు ఇష్ట ప‌డ‌ట్లేద‌ట‌. అస‌లు నాయ‌కులు కూడా ప‌ని చేయ‌డం లేద‌ట‌. దీంతో జ‌గ‌న్ ప్లీజ్ నా ప‌రువు కాపాడ‌మ‌ని జ‌గ‌న్ అక్క‌డ నాయ‌కుల‌కు.. లోక‌ల్ వైసీపీ ప్ర‌జా ప్ర‌తినిధుల‌ను వేడుకుంటున్నార‌ట‌.        

మరింత సమాచారం తెలుసుకోండి: