ప్రజా యుద్ధ నౌక గద్దర్ బ్రతికి ఉన్నన్ని రోజులు కార్మిక శ్రామిక బడుగు బలహీన వర్గాల కోసం తన పోరాటాన్ని చేశారు. అలాంటి గద్దర్  దశాబ్ద కాలం పాటు ఉద్యమాలు నడిపారు.  ఏనాడు కూడా ప్రభుత్వం నుంచి వచ్చిన పదవులను కానీ డబ్బులను కానీ ఆశించకుండా ప్రజా ఉద్యమాలే  ప్రథమ ధ్యేయం గా  ముందుకు వెళ్లిన గద్దర్ అనారోగ్యం కారణంగా 2023 ఆగస్టు 6 వ తేదీన మరణించారు. ఆయన మరణం రెండు తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది. ఇలాంటి గద్దర్  తన చివరి కోరిక తీరకుండానే మరణించారని  తన సన్నిహితులు చెబుతున్నారు. మరి ఆయన కోరిక ఏంటి ఆ వివరాలు చూద్దాం. 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే రాష్ట్రం బాగుపడుతుందని గద్దర్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం లో  తన గొంతు ను వినిపించారు. ఎంతో మంది ప్రాణాలు అర్పించిన విద్యార్థుల కుటుంబాలకు అండగా నిలిచారు.  ఈ విధంగా తన పాటలతో ఉద్యమ స్ఫూర్తి ని నింపిన గద్దర్ చివరికి కెసిఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్యాయం జరుగుతుందని ఆయనను కూడా వ్యతిరేకించారు. ఈ దొరల పాలనలో అంతా ఇబ్బందులే ఉన్నాయని చెప్పుకొచ్చారు. అలాంటి గద్దర్  తన చివరి కోరిక తీరకుండానే తెలుస్తోంది.

అయితే గద్దర్  రాహుల్ గాంధీ సమక్షం లో కాంగ్రెస్ పార్టీ కి సపోర్ట్ చేసిన విషయం అందరికీ తెలుసు. ఆయన 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో లేదంటే 2024 పార్లమెంట్ ఎలక్షన్స్ లో అయినా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి  ప్రజా నాయకుడి గా పోరాటాలు చేయాలని అనుకున్నారు. కానీ ఈ కోరిక తీరకుండానే ఆయన మరణించడం  బాధాకరం. అలాంటి గద్దర్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాంకు బండు పై ఉన్నటు వంటి విగ్రహానికి నివాళులర్పించనున్నారు. చిత్ర పటాలకు ఈరోజు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: