కొడాలినాని, వంశీలను పేర్ని నాని దాచాడంటూ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. శవం లేస్తే తప్ప జగన్ ఏపీకి రావాట్లేదంటూ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. ఇవాళ మీడియాతో గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు. తన భద్రత పెంచాలని జగన్ అంటుంటే.. జగన్ నుంచి తమకు భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని చురకలు అంటించారు గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర.


ఏపీలో ఎవరైనా చనిపోయి శవం కనిపిస్తే.. గద్దలా వాలటానికి  జగన్ వస్తున్నాడని సెటైర్లు పేల్చారు. పులివెందుల ఎమ్మెల్యేకి సీఎం తరహా సెక్యురిటి, పీఎం తరహా భద్రత ఉండదనే విషయం జగన్ తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు.  రాబందులా ఐదేళ్లు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాన్ని పీక్కు తిన్న జగన్ అండ్ కో చంద్రబాబు చేసే అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతోందని మండిపడ్డారు  గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర.


రెడ్ బుక్ పేరు వింటేనే వైసీపీ నేతలు గజగజ వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. పాపాలు చేసి పారిపోయిన వైసీపీ నేతలు ఎక్కడ దాక్కున్నా వెతుకొచ్చి దోషులుగా నిలబెట్టేందుకు పోలీసు యంత్రాంగం సిద్దంగా ఉందని పేర్కొన్నారు.  ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాకముందే కౌంటింగ్ కేంద్రం నుంచి వంశీ, కొడాలినాని పారిపోయారని గుర్తు చేశారు  గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర.  కొడాలి నాని, వంశీలను పేర్ని నానినే దాచాడనే అనుమానాలు ఉన్నాయని ఆరోపణలు చేశారు.


జగన్ పిచ్చికి తగ్గట్టు మా బందరు పిచ్చోడు పేర్ని నాని తయారయ్యాడని... సుపరిపాలన కోసం సీఎం వాట్సాప్ గ్రూప్ లు పెట్టమనడాన్ని పేర్ని నానీ వక్రీకరిస్తున్నారని ఆగ్రహించారు  గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర.  పేర్ని నాని హైదరాబాద్ లో అక్రమ ఆస్తులు కొనటానికి వెళ్తే ప్రజలు తరిమారని... ఇలానే పేర్నినాని పిచ్చి ప్రేలాపనలు పేలితే ఏపీ ప్రజలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు  గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర.

మరింత సమాచారం తెలుసుకోండి: