ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... చంద్రబాబు కూటమి సర్కార్ దూసుకుపోతోంది. ఎన్నికల కంటే ముందు ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు చేయడం పైన దృష్టి పెట్టిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం... ఇప్పుడు పదవులను భర్తీ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసింది. ఈనెల 8వ తేదీన... తెలుగుదేశం టిడిపి బ్యూరో సమావేశం కూడా జరగనుంది. ఈ సందర్భంగా... ఏపీలో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీపై... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు.


అయితే ఇలాంటి నేపథ్యంలో తిరుమల దేవస్థానం చైర్మన్ పదవి పై... మళ్లీ కొత్త చర్చ తెరపైకి వచ్చింది. టీటీడీ చైర్మన్గా టీవీ 5 ఛానల్ ఓనర్ బిఆర్ నాయుడు ను ఫైనల్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి చర్చించారట. కలెక్టర్ల సమావేశం అయిన తర్వాత... టీటీడీ చైర్మన్ పదవి భర్తీపై నిన్న నిర్ణయం తీసుకున్నారట.


అయితే ఈ పదవికి టీవీ 5 ఓనర్ బిఆర్ నాయుడు మాత్రమే కరెక్ట్ గా సూట్ అవుతాడని... చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మీడియా అధినేతగా... చంద్రబాబును కాపాడారు బిఆర్ నాయుడు. బ్లూ మీడియా ఎన్నో విషపూరితమైన వార్తలు రాసినప్పటికీ... తెలుగుదేశం పార్టీ తరఫున తన గొంతును వినిపించారు బిఆర్ నాయుడు.


అలాగే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు బిఆర్ నాయుడు. అందుకే త్వరలోనే టీటీడీ చైర్మన్గా BR నాయుడు ను ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మొన్నటి వరకు మెగా బ్రదర్ నాగబాబుకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఆ పదవి పట్ల మెగా బ్రదర్ నాగబాబు పెద్దగా ఆసక్తిగా లేరట. అందుకే ఆ పదవిని... నాయుడుకు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

ttd