భారతదేశంలోని అత్యంత ధనవంతుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అయిన ముకేశ్ అంబానీ గురించి తెలియని వారంటూ ఎవరూ లేరు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తిగా...... ప్రపంచంలోనే 11వ అత్యంత ఐశ్వర్యవంతుడిగా ముకేశ్ అంబానీ కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన సంపద 106 బిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీలో ప్రకారం సుమారుగా రూ. 9,15,405కోట్లు. స్టాటిస్టిక్ ప్రకారము... ముకేశ్ అంబానీ కేవలం ఒక్క గంటకు సంపాదిస్తున్నంత డబ్బును ఒక సగటు భారతీయుడు సంపాదించాలంటే చాలా కష్టం.


ముకేశ్ అంబానీ సంపాదిస్తున్న ఒక గంట సంపాదనను సాధారణ వ్యక్తి సంపాదించాలంటే కనీసం 17.4 మిలియన్ సంవత్సరాల సమయం పడుతుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.... సంవత్సరానికి రూ. 4లక్షలు (నెలకు సుమారు రూ. 33000) సంపాదించే వ్యక్తి రూ. 90 కోట్లు సంపాదించాలంటే.... సుమారుగా 1.74 కోట్ల సంవత్సరాలు పడుతుందని నివేదికలు చెబుతున్నాయి. సాధారణంగా ఒక మనిషి వందేళ్లకు మించి బతకడమే చాలా కష్టం. అలాంటిది ఎవరైనా కోటి సంవత్సరాలు కష్టపడి డబ్బులను సంపాదించగలరా. సులువుగా చెప్పాలంటే ఒక సగటు సామాన్యుడు కలలో కూడా సంపాదించలేనంత డబ్బులను ముకేశ్ అంబానీ సంపాదిస్తున్నారు.

ఇక అంబానీ ఇంట్లో పనిచేసే స్టాఫ్ జీతం కూడా లక్షలలో ఉంటుంది. ముఖేష్ అంబానీ ఇంట్లో వంట చేయాలంటే డిగ్రీ లేదా డిప్లమా కచ్చితంగా ఉండాల్సిందే. ఆయన ఇంట్లో పని చేసేవారు సుమారు 500 మంది వరకు ఉంటారు. ఇక అంబానీ ఇంట్లో వంట చేసే వారి వేతనం నెలకు రెండు లక్షలు ఉంటుంది. డ్రైవర్ జీతం కూడా రెండు లక్షలపైనే ఉంటుంది. అంబానీ ఇంట్లో ఉద్యోగం చేయాలంటే రాసిపెట్టి ఉండాలి.


మరి వారి ఇంట్లో అని దొరకడం కూడా చాలా కష్టం. వారి ఇంట్లో పని చేయాలంటే పరీక్షలు రాయాలి. అంబానీ ఇంట్లో ఎలాంటి పని చేయాలనుకున్న అన్ని పనులకు సంబంధించి తప్పకుండా పరీక్షలు రాయాలి. ఇక రీసెంట్ గా జరిగిన అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ల వివాహానికి దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ హాజరయ్యి సందడి చేశారు. ప్రపంచంలోనే వీరి పెళ్లిని ప్రతి ఒక్కరు మాట్లాడుకునేంత అంగరంగ వైభవంగా ముకేశ్ అంబానీ వారి కుమారుడి వివాహ వేడుకను అంగరంగ వైభవంగా జరిపించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: