* లోక్ పాల్ ఉద్యమంతో దేశవ్యాప్తంగా గుర్తింపు.!
* అత్యంత పిన్నవయస్కుడిగా ఢిల్లీ పీఠం ఎక్కిన్న కేజ్రీవాల్.!
* అధికారిక హోదాలో అరెస్ట్ అయినా తొలి సీఎం.!
(ఢిల్లీ-ఇండియాహెరాల్డ్ ): ఢిల్లీ సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ 1968-ఆగస్ట్-16న హర్యానాలో జన్మించారు. గోబింద్ రామ్ కేజ్రివాల్ కు గీతా దేవికి పుట్టిన ముగ్గురు సంతానంలో ఇతను పెద్ద వాడు.ఐఐటి ఖరగపూర్ లో మెకానికల్ ఇంజనీరింగ్ లో పట్టభద్రులు అయ్యారు. మొదట భారతీయ రెవెన్యూ సర్వీసులో కొంతకాలం పనిచేశారు. జన లోకపాల్ బిల్లు కోసం అన్నా హజారేతో కలిసి చేసిన పోరాటం, సమాచార హక్కు చట్టం కోసం చేసిన పోరాటంతో ఇతను దేశవ్యాప్తంగా మంచి ప్రాముఖ్యత సంపాదించారు. సమాచార హక్కు చట్టం తీసుకురావటం, పేదవారి స్తోమత పెంచడానికి చేసిన కృషికి 2006 లో రామన్ మెగసెసే పురస్కారం లభించింది. 2012 లో ఆమ్ ఆద్మీ పార్టీ అనే రాజకీయ పార్టీని స్థాపించి అదే సంవత్సరంలో స్వరాజ్ అనే పుస్తకాన్ని ప్రచురించారు. పార్టీ స్థాపించిన తరువాత జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో మూడుసార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్ పై 25, 864 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు .కేజ్రివాల్ ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన వారిలో అత్యంత పిన్నవయస్కుడు..తర్వాత జన్ లోక్‌పాల్ బిల్లు ఢిల్లీ శాసనసభలో ఆమోదం పొందకపోవడంతో కేజ్రీవాల్ 49 రోజుల తన ప్రభుత్వాన్ని రద్దు చేసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.2014 పార్లమెంటు ఎన్నికలలో వారణాసి నుంచి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ పై అరవింద్ కేజ్రివాల్ పోటిపడ్డాడు అయితే ఆ ఎన్నికల్లో నరేంద్ర మోడి చేతిలో 3, 71, 784 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ ముందుండి నడిపించారు. 70 స్థానాలలో 67 స్థానాలు పొంది అనూహ్య విజయం సాధించడంతో ఢిల్లీ ముఖ్యమంత్రిగా తిరిగి ఎన్నికయ్యారు. కేజ్రివాల్ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి 31, 583 వోట్ల ఆధిక్యంతో గెలిచారు.అలాగే 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాల్లో 62స్థానాలు గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి సునీల్ కుమార్ యాదవ్ పై 14227 ఓట్ల తేడాతో కేజ్రివాల్ గెలుపొందారు.
అరవింద్ కేజ్రీవాల్ కు 2024 లో రాజకీయంగా భారీ దెబ్బ ఎదురైందనే చెప్పాలి.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు మనీ లాండరింగ్ వ్యవహారంలో ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను ED 2024 మార్చ్ నెలలో అరెస్ట్ చేసింది. అయితే ఈడీ ఇప్పటి వరకు 9సార్లు సమన్లు జారీ చేస్తే ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు.ఈడీ తనను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించమని హైకోర్ట్ ను ఆశ్రయిస్తే హైకోర్ట్ ఒప్పుకోకపోయేసరికి సుప్రీంకోర్ట్ ను ఆశ్రయించారు. విచారణ జరిపే లోపే అరెస్ట్ అయ్యారు.దేశంలో ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ అరెస్ట్ అయిన మొట్టమొదటి సిట్టింగ్ సీఎం అరవింద కేజ్రీవాల్ కావడం గమనార్హం. గతంలో బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత షోరూం సైతం పదవిలో ఉండగానే అరెస్టయ్యారు కానీ దర్యాప్తు సంస్థలు కస్టడీలోకి తీసుకోవడం కంటే ముందే తమ పదవికి రాజీనామా చేశారు. చట్టప్రకారం రాజ్యాంగ పరిధిలోనున్న పోస్టింగులలో ఒక్క రాష్ట్రపతి, గవర్నర్ పోస్టులకు మాత్రమే అరెస్టు నుంచి రక్షణ ఉంటుంది. వాళ్ల పదవీకాలం ముగియడం లేదంటే స్వచ్ఛందంగా రాజీనామా చేసేదాకా వాళ్లకు ఊరట లభిస్తుంది. అయితే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి లాంటి పదవులకు మాత్రం ఎలాంటి రక్షణ ఉండదు అలాగని కేవలం అరెస్టు అయినంత మాత్రాన వాళ్లు ఆ పదవులను కోల్పోరు ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం కచ్చితంగా శిక్ష పడితేనే పదవిని కోల్పోతారు. అయితే కేజ్రీవాల్ విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది కాబట్టి ఆయన అరెస్టు అయినందునా ఈడి కస్టడీ నుండి పరిపాలన సాగిస్తున్నారు. మార్చి 24న తొలిసారి ఢిల్లీలో నీటి సరఫరా కి సంబంధించిన అధికారికా ఆదేశాలను జారీ చేశారు.దాదాపు 130 రోజులకు పైగా ఆయన ఇంకా తీహార్ జైలులోనే ఉండి రాష్ట్రాన్ని ఆయనకున్న పవర్తో అక్కడి నుండే పరిపాలిస్తున్నారు.
* అత్యంత పిన్నవయస్కుడిగా ఢిల్లీ పీఠం ఎక్కిన్న కేజ్రీవాల్.!
* అధికారిక హోదాలో అరెస్ట్ అయినా తొలి సీఎం.!