అయితే ఈ వీడియో గత నెల 30వ తేదీ జరిగిందట. కానీ ఇప్పుడు వెలుగులోకి రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. బాధితుడు తెనాలి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది.. బాధితులు తల్లి తెలిపిన ప్రకారం.. చిన్న పరిమి గ్రామానికి చెందిన అజ్గర్ అనే యువకుడిని కొంతమంది యువకులు పని ఉందంటూ తమతో తీసుకువెళ్లి మద్యం తాగించారట. అలా వారు కూడా మద్యం సేవించిన తర్వాత కొన్ని కారణాలు చెబుతూ ఆ యువకుడు పైన చాలా దారుణంగా విచక్షణ రహితంగా కొట్టడం తన్నడం బెల్టులతో చితకబారడం వంటివి చేసినట్లుగా ఈ వీడియోలో కనిపిస్తోంది.
ముఖ్యంగా అతడిని కాళ్లు చేతులు తేడా లేకుండా కర్రలతో బెల్టులతో సైతం చితకబాదుతూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. అయితే ఈ దృశ్యాలను వాళ్లే మొబైల్ లో చిత్రీకరించి ఆనందాన్ని పొందుతున్నట్లు కనిపిస్తుంది. చివరికి తీవ్ర గాయాల పాలైన ఆ యువకుడుని సైతం కాలువలోకి విసిరేద్దాం అనుకుంటున్నా సమయంలో ఆ యువకుడు యొక్క సొంత గ్రామానికి చెందిన వ్యక్తి ఈ విషయాన్ని గమనించి కుటుంబ సభ్యులకు సైతం తెలియజేశారట. దీంతో కుటుంబ సభ్యులు ఆ యువకుడిని తీసుకొని తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసు పైన పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సమాచారం.