సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉండటంతో పాటు క్లిష్టమైన సమస్యలను సులువుగా పరిష్కరించే తెలివితేటలు చంద్రబాబు సొంతమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబుపై చాలా సందర్భాల్లో అవినీతి ఆరోపణలు వినిపించినా అవి ప్రూవ్ కాలేదు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లుపై దాడి, ఫైబర్ నెట్ కేసుల వల్ల చంద్రబాబు నాయుడు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది.
 
దాదాపుగా నాలుగు నెలలు ఆయన జైలు శిక్ష అనుభవించారు. జైలులో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు ఆరోగ్య సమస్యలను సైతం ఎదుర్కొన్నారు. అయితే చంద్రబాబుకు జైలు శిక్ష వరంగా మారిందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు. ఈ జైలు శిక్ష వల్ల చంద్రబాబు నాయుడు ఏపీ ఓటర్ల దృష్టిలో హీరో అయ్యారని చెప్పవచ్చు. చంద్రబాబును జగన్ కావాలని టార్గెట్ చేశారని న్యూట్రల్ ఓటర్లు భావించారు.
 
చంద్రబాబుకు ఎక్కువ సంఖ్యలో సింపతీ ఓట్లు పడ్డాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. చంద్రబాబు నాయుడు జైలులో ఉన్న సమయంలోనే పవన్ పొత్తు ప్రకటించడం పార్టీకి ఊహించని స్థాయిలో ప్లస్ అయిందని చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు, పవన్ కలిస్తే ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ఈ ఎన్నికల ఫలితాలు ప్రూవ్ చేశాయని చెప్పవచ్చు.
 
వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని పరిస్థితి ఏర్పడిందంటే చంద్రబాబును ప్రజలు ఎంతగా నమ్మారో అర్థమవుతుంది. సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు ప్రకటించిన పథకాలకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. త్వరలో బాబు సర్కార్ మిగిలిన పథకాలను సైతం అమలు చేసే అవకాశం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చంద్రబాబు నాయుడు రెండు నెలల పాలనపై ప్రజల నుంచి పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తమవుతోంది. రాబోయే రోజుల్లో సైతం బాబు ప్రజల నుంచి మెప్పు పొందితే రాజకీయాల్లో ఆయనకు తిరుగుండదని చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: