- అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ..
- చివరికి 100 రోజులు జైలుకెళ్ళిన చిదంబరం..
కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో సోనియా, రాహుల్ గాంధీ తర్వాత ఎక్కువగా వినబడే పేరు చిదంబరం. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రులుగా పలు పదవులు చేపట్టారు. అంతేకాదు కాంగ్రెస్ సర్కారులో కీలక నేతగా ఉండి పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం చిదంబరంకే ఉండేది. అలా ఎంతో పేరు తెచ్చుకున్న చిదంబరం కాంగ్రెస్లో ఇక నాకు అడ్డు అదుపు లేదనుకున్నారో ఏమో రెండు తప్పు పనులు చేసి చివరికి జైలుకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. అలాంటి చిదంబరం ఏం తప్పు చేశారు.. జైలుకి ఎందుకు వెళ్ళారు అనే వివరాలు చూద్దాం..
చిదంబరం ను మొదటిసారి 2019 ఆగస్టు 21న ఢిల్లీలోని జోరుబాగోలో తన నివాసంలో అరెస్టు చేశారు. ఆయనను అరెస్టు చేసే సమయంలో తన ఇంటికి సిబిఐ ఈడి అధికారులు చేరుకున్నారు. ముందుగా చిదంబరమును అరెస్టు చేయడానికి ప్రయత్నం చేయగా వారి యొక్క వ్యక్తిగత సిబ్బంది సిబిఐ ని అడ్డుకొని గేట్లు వేసేశారు. దీంతో వెనక్కి తగ్గని సిబిఐ గోడదూకి ఇంట్లోకి ప్రవేశించి చివరికి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అలాంటి చిదంబరం రెండు కేసుల్లో నిందితుడిగా పేర్కొన్నారు సిబిఐ. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఐఎన్ఎక్స్ మీడియా కేసు. 2007లో ఐఎన్ఎక్స్ మీడియా సంస్థకు విదేశాల నుంచి 305 కోట్ల నిధులు సమకూరాలని నిధులు రావడానికి చిదంబరం ఎంతో సహకారం అందించారని తెలిసింది. అయితే విదేశీ పెట్టుబడులు ఇండియాలో పెట్టాలి అంటే ఎఫ్ఐపిబి నిబంధన ప్రకారం చాలా తక్కువ అమౌంట్ పెట్టుబడిగా పెట్టాలి. ముందుగా పెట్టుబడిదారులు ఎఫ్ఐపిబిద్వారా నాలుగు కోట్లకు అనుమతి తీసుకొని 300 కోట్ల పెట్టుబడి పెట్టి సిబిఐ కి దొరికిపోయారు.