వైసిపి అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైసీపీ అధినేత జగన్ రెడ్డి పదే పదే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు పవన్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ వచ్చారు. పార్టీ పరంగా సిద్ధాంతపరమైన విమర్శలు చేయకుండా జగన్ పవన్ మూడు పెళ్లిళ్లు ... మూడు భార్యలు అంటూ విమర్శలు చేస్తూ పవన్తో పాటు జనసైనికుల ఆత్మాభిమానాన్ని దెబ్బ కొట్టేలా ప్రవర్తించారు. దీంతో పవన్ కళ్యాణ్ జగన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను ముఖ్యమంత్రి పీఠం నుంచి గద్దె దించుతాను అని శపధం చేసి... అన్నంతపని చేశారు. పవన్ అన్నంత పనిచేయటమే కాదు అసలు వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా అన్నది లేకుండా చేశారు.


జగన్ కు ఘోర పరాజయం రుచి చూపించి కలలో కూడా పవన్ కళ్యాణ్ గుర్తు వచ్చేలా చేశారు. ఎన్నికలకు ముందే కొందరు వైసీపీ నేతలు జనసేనలోకి జంప్ చేసి ఎమ్మెల్యేలు.. ఎంపీలు అయ్యారు. వంశీకృష్ణ శ్రీనివాస్ - వల్లభనేని బాలశౌరి వీరు వైసీపీ నుంచి జనసేనలో చేరి ఎమ్మెల్యే.. ఎంపీ అయినవారే. ఈ క్రమంలోనే పవన్ ఎన్నికల తర్వాత కూడా వైసిపిని పూర్తిగా ఖాళీ చేసేందుకు నడుం బిగించినట్టే కనిపిస్తోంది. విశాఖపట్నంలో వైసీపీకి - జనసేన షాకుల మీద షాక్కులు ఇస్తుంది. ఎన్నికలకు ముందే ఆ పార్టీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ జనసేనలోకి వెళ్లి ఎమ్మెల్యే అయ్యారు.


అలాగే ఎన్నికలకు ముందే వైసీపీకి చెందిన ముగ్గురు కార్పొరేటర్లు జనసేన కండువా కప్పుకున్నారు. తాజాగా వైసీపీకి చెందిన ఐదుగురు ఐదుగురు కార్పొరేటర్ల‌ తో పాటు గ్రేటర్ విశాఖ పట్నంలోని పలువురు కీలక వైసిపి నేతలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా వీరికి కండువాలు కప్పి తమ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో జనసేన అధిక స్థానాలు గెలుచుకుంటుందని పవన్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్ దూకుడు చూస్తుంటే విశాఖపట్నంలో వైసీపీని పూర్తిగా ఖాళీ చేసేలా కనిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: