- విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స గెలుపు వైసీపీ కి చావో రేవో.. !
- ఓడిపోతే బొత్స కు రాజకీయ సన్యాసం తప్పదా .. !
- అయిష్టం గానే ఎన్నికల బరిలోకి బొత్స .. !
( ఉత్తరాంధ్ర - ఇండియా హెరాల్డ్ ) .
వైసీపీ అధినేత జగన్ తమ పార్టీకి చెందిన ఓ కీలక నేతతో రాజకీయ సన్యాసం చేయించబోతున్నారా ? అంటే ఇప్పుడు వైసిపి వర్గాలలో ఇదే పెద్ద గుసగుసగా వినిపిస్తోంది. జగన్ రాజకీయ సన్యాసం చేయించబోయే ఆ నేత ఎవరో ? కాదు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ పేరును జగన్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే . అసలు ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసేందుకు ఏ నేతా కూడా ముందుకు రాని పరిస్థితి. వాస్తవంగా ఈ ఎన్నికలలో పోటీ చేయటం బొత్స కు ఎంత మాత్రం ఇష్టం లేదు. అయితే జగన్ పట్టుబట్టి బలవంతం చేయడంతో బొత్స అయీష్టంగానే బరిలోకి దిగుతున్నారు.
వాస్తవంగా చూస్తే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీకే ఏకపక్షంగా మెజార్టీ ఉంది .. కానీ ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత వైసీపీకి చెందిన ఎంపీటీసీలు - జడ్పీటీసీలు పెద్ద ఎత్తున టిడిపి - జనసేన లో చేరిపోయారు. దీంతో ఇప్పుడు బొత్స కు కూడా తన గెలుపు పై సందేహాలు ముసురుకున్నాయి. దీంతో బొత్స కూడా ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు. మా పార్టీకి మెజార్టీ ఉంది .. కూటమి పార్టీలకు లేదు ఇప్పుడు ఓట్లు కొనేందుకు ముందుకు వస్తున్నారు అంటూ బొత్స ప్రచారం మొదలుపెట్టారు.
వాస్తవంగా చూస్తే ఈ ఎన్నికలు బొత్స సత్తి బాబు కు చివరి ఎన్నికలుగా మిగిలిపోనున్నాయి. ఎన్నికల్లో బొత్స ఓడిపోతే రాజకీయ సన్యాసం తప్పదని వైసిపి వర్గాలే చర్చించుకుంటున్నాయి.