•నష్టాల్లో ఉన్న రైల్వే ని లాభాల బాట పట్టించిన లాలూ ప్రసాద్ యాదవ్..

•ఆవుల కాపరి కొడుకు కానీ అంతర్జాతీయ గుర్తింపు

* పశువుల దానా కుంభకోణంలో జైలుశిక్ష..


(ఆంధ్రప్రదేశ్ -ఇండియా హెరాల్డ్)

లాలూ ప్రసాద్ యాదవ్.. 20వ బీహార్ ముఖ్యమంత్రిగా పేరు సొంతం చేసుకున్న ఈయన రైల్వే మంత్రిగా కూడా పనిచేసిన విషయం తెలిసిందే. దాదాపు 7 సంవత్సరాల పాటు బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగిన prasad YADAV' target='_blank' title='లాలూ ప్రసాద్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయ జీవితానికి తొలిమెట్టు పాట్నా విశ్వవిద్యాలయంలోని విద్యార్థుల సంఘానికి అధ్యక్షత వహించడమే అని చెప్పవచ్చు.  జయప్రకాష్ నారాయణ వల్ల ప్రభావితమైన విద్యార్థుల ఉద్యమానికి 1970లో లాలూ నాయకత్వం కూడా వహించారు. విద్యార్థి నాయకుడైన భారతీయ ఎమర్జెన్సీ కాలంలో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీకి ఒక వినతి శాసనాన్ని కూడా అందించి తనదైన మార్క్ సృష్టించుకున్నారు.

29 సంవత్సరాల అతి చిన్న వయసులోనే ఆరవ లోక్సభకు ఎన్నికై,  కేవలం 10 సంవత్సరాల వ్యవధిలోనే బీహార్ లో ఒక ఉజ్వల శక్తిగా ఎదిగాడు. 1989లో బీహార్ లో  జరిగిన ఎన్నికలలో రాష్ట్ర ఎన్నికలలో కూడా లాలు నేషనల్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయ పతాన నడిపించి రికార్డు సృష్టించారు. 1990లో బీహార్లో జరిగిన ఆర్థిక అభివృద్ధికి గానూ ప్రపంచ బ్యాంకు ప్రశంసలు అందుకున్న ఈయన 1996లో బీహార్లో బయటపడిన రూ.950 కోట్ల పశుగ్రాస కుంభకోణంలో లాలుతో పాటు ఇతర ముఖ్య ప్రభుత్వ ఉద్యోగులు కూడా రాజకీయ నాయకులపై కూడా అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇక దాంతో లాలు ప్రసాద్ యాదవ్ తన ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేశారు.

కేంద్ర మంత్రిగా పదవీ స్వీకారం చేసిన తర్వాత నష్టాలలో నడుస్తున్న భారతీయ రైల్వేను లాభాలు దిశగా నడిపించడంలో వినియోగించిన వినూత్న యాజమాన్య పద్ధతులకు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలోని ప్రజలు ఒక ఆవుల కాపరి కొడుకు ఇంతకు స్థాయికి ఎలా చేరుకోగలిగాడు అంటూ అందరూ ఆశ్చర్యం కూడా వ్యక్తం చేశారు. అలాంటి ఈయన దానా కుంభకోణంలో నాలుగు కేసుల్లో జైలు శిక్ష అనుభవించారు. చిట్టచివరిది ఐదవదైన డోరండా ఖజానా కేసులో ఆయనకు సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం 2022 ఫిబ్రవరి 21న ఐదేళ్ల జైలు శిక్ష ఖరారు చేసి,  రూ.60 లక్షల జరిమానా కూడా విధించింది.ఆవుల కాపరి కొడుకు అంతర్జాతీయ స్థాయిని పొంది చివరికి జైలు పాలవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: