అయితే ఇప్పుడు అంత సీను లేదని ఇందులో సగం ఇస్తే గొప్ప అంటూ చాలామంది టిడిపి నేతలు కూడా తెలియజేస్తున్నారట.. గతంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుత డిప్యూటీ సీఎం కూటమి అధికారంలోకి వస్తే.. నామినేటెడ్ పదవులు పెద్ద సంఖ్యలో వస్తాయని నేతలకు సైతం తెలియజేస్తూ ఉండేవారట. కానీ ఆ సమయం రానే వచ్చిన ఇప్పుడు రెండు పార్టీలకు కలిపి కేవలం 20 శాతం మాత్రమే నామినేటెడ్ పదవులు ఇస్తారు అని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారట.
అంతేకాకుండా 20% లో జనసేనకు సగం మాత్రమే దక్కే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే ఎంపీ సీట్లును కూడా జనసేనకు చాలా తక్కువగానే ఇచ్చారు.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని కూడా ఈ విషయంలో ఒప్పించడంలో బాగానే సక్సెస్ అయ్యారని కూడా చెప్పవచ్చు. ఇప్పుడు నామినేటెడ్ పదవులు విషయంలో కూడా.. తానిచ్చినవన్నీ తీసుకునేలా పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు ఒప్పుకునేలా చేయడం అటు జనసేన నేతలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన దాని కల్లా పవన్ కళ్యాణ్ తలువుపడం వల్ల చాలామంది నేతలు ఏం మాయ చేశావయ్యా చంద్రబాబు అంటూ జనసేన నాయకులు సైతం ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నారు. జనసేన నేతలు తీవ్ర నిరాశకు సైతం గురయ్యేలా కనిపిస్తుంది. మరి రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉందో చూడాలి.